దరఖాస్తుల ఆహ్వానం


Sun,January 21, 2018 02:34 AM

ఆసిఫాబాద్ రూరల్: 2018-19 విద్యాసంవత్సరానికిగానూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట, రామాంతపూర్ హైదరాబాద్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశానికి అర్హులైన గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23 సాయంత్రం 5 గంటల్లోగా జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి కార్యాలయం ఆసిఫాబాద్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుదారులు 1-06-2012 నుంచి 31-05-2013 మధ్యలో జన్మించి ఉండి జనన ధ్రువీకరణ పత్రాలను సంబంధిత తహసీల్దార్ లేదా మున్సిపాలిటీ నుంచి పొంది ఉండాలన్నా రు. అభ్యర్థుల కుల, నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను కూడా జత చేయాలని సూచించారు. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతం వారికి రూ. 1,50,000, పట్టణ ప్రాంతం వారికి రూ. 2,00,000 ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 24న అభ్యర్థుల దరఖాస్తులను గిరిజన సంక్షేమాధికారి కార్యాలయంలో పరిశీలించి, లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తామన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...