రేషన్‌కూ ఈ-పాస్

Sat,January 20, 2018 03:30 AM

-సరుకులు పక్కదారి పట్టకుండా సర్కారు చర్యలు
-ఇక ప్రతి చౌకధరల దుకాణంలో ఈ-పాస్ యంత్రం
-ఫిబ్రవరి ఒకటి నుంచి అమలుకు ఏర్పాట్లు
-వినియోగంపై ఇప్పటికే డీలర్లకు ప్రత్యేక శిక్షణ
కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో 285 రేషన్ దుకాణాలు ఉండగా, లక్షా 35 వేల 585 ఆహార భధ్రత కార్డులు ఉన్నాయి. ఒక్కో వ్యక్తికి నెలకు ఆరు కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నారు. ప్రతి నెలా జిల్లాకు 2959604 క్వింటాళ్ల బి య్యం సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం రేషన్ సరుకు ల కోసం కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు వెళ్లినా బియ్యం, ఇతర వస్తువులు ఇస్తున్నారు. కొన్ని ప్రాం తాల్లోని దుకాణాల్లో లబ్ధిదారులు తీసుకోకపోయి నా.. వారి పేరిట సరుకులు సరఫరా అవుతున్నాయి. దీంతో పలువురు వాటిని అక్రమంగా తరలించి సొ మ్ము చేసుకుంటున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ పాస్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నది.

ఈ పాస్‌తో అక్రమాలకు చెక్

రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం ఈ పాస్ యంత్రాలను అందుబాటులోకి తెస్తున్నది. నేరుగా లబ్ధిదారులకే సరుకులు అందించే విధంగా పారదర్శకమైన విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది. ప్రతి రేషన్ దుకాణంలో బయోమెట్రిక్ యంత్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ యంత్రం జిల్లా, రాష్ట్ర కార్యాలయాలకు అనుసంధానమై ఉంటుంది. ఇప్పటికే ప్రజలకు ఆధార్ కార్డులు జారీ చేసినప్పుడు ప్రతి ఒక్కరి బొటన వేలు ముద్ర తీసుకున్నారు. దీనిని ఆహార భద్రత కార్డులతో అనుసంధానం చేస్తారు.

ఆహార భద్రత కార్డులో పేరున్న వారిలో ఎవరో ఒకరు తప్పనిసరిగా చౌకధరల దుకాణానికి వెళ్లి సరుకులు తీసుకోవాల్సి ఉంటుంది. అలా వెళ్తేనే సంబంధిత వ్యక్తి కుటుంబానికి సరుకులు ఇస్తారు. ఒక వేళ ఓ నెలలో కార్డుపై బియ్యం తీసుకోకపోతే తదుపరి నెలలో ఇవ్వరు. కార్డులో పేర్లున్న వ్వక్తుల్లో ఎవరో ఒకరు కచ్చితంగా దుకాణానికి వెళ్లాల్సిందే. ఈ విధానం ఫిబ్రవరి ఒకటి నుంచి అమల్లోకి రానున్నది. ఇప్పటికే రెండు రోజులుగా యంత్రాల వినియోగంపై డీలర్లకు అధికారులు శిక్షణకు ఇస్తున్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే జిల్లాలో ఏటా సరఫరా చేస్తున్న బియ్యంలో సుమారు 20 శాతం ఆదా అయ్యే అవకాశమున్నది.

ఫిబ్రవరి నుంచి అమలు చేస్తాం

ఫిబ్రవరి ఒకటి నుంచి జిల్లాలోని రేషన్ దుకాణాలన్నింటిలో ఈ పాస్ విధానాన్ని అమలు చేస్తాం. యంత్రాల వినియోగంపై డీలర్లుకు శిక్షణ ఇచ్చాం. కార్డులో ఉన్న లబ్ధిదారుని కుటుంబ సభ్యులు తప్పనిసరిగా రేషన్ దుకాణానికి వచ్చి బియ్యం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పాస్‌యంత్రాల ద్వారా రేషన్ సరుకులు పక్కదారి పట్టవు. ఒకరికి బదులు వేరొకరు బియ్యం తీసుకోరాదు.
- అశోక్‌కుమార్, జాయింట్ కలెక్టర్

70
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles