పనుల్లో వేగం పెంచండి

Sat,January 20, 2018 03:24 AM

-మౌలిక వసతులపై దృష్టి పెట్టండి
-మేలోగా ఆశ్రమ పాఠశాల పూర్తి చేయండి
-కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
-పునరావాస గ్రామాల్లో పర్యటన
కెరెమెరి: కుమ్రం భీం ప్రాజెక్ట్‌లో ముంపు గ్రామాల పునరావాస కాలనీల నిర్మాణ పనుల వేగం పెంచాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలంలో ని దేవుడ్‌పల్లి, ధనోరా గ్రామాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పనుల్లో నాణ్యత పాటిస్తూ సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజల కు ఏమాత్రం ఇ బ్బందులు తలెత్తకుండా తాగునీ రు, విద్యుత్‌తోపా టు మౌలిక వసతులపై దృష్టి పెట్టాలాన్నారు. దేవుడ్‌పల్లిలో 73, రాంజీగూడ లో 78 కుటుంబాలకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలన్నారు. నిశాని నుంచి దేవుడ్‌పల్లికి అసంపూర్తిగా 1.5 కిలో మీటర్ల రోడ్డుకు నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు లేనందున పను లు నిలిచిపోయాయనీ, వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్‌ను కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాంజీగూడలోని ఆశ్రమ పాఠశాలను వచ్చే మే లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జేసీ అశోక్‌కుమార్, ఆర్డీఓ కదం సురేశ్, ఎస్‌డీసీ రమేశ్, జడ్పీ సభ్యుడు అబుల్ కలాం, పీఆర్ ఈఈ వెంకట్రా వ్, తదితరులు పాల్గొన్నారు.

88
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles