ఎస్పీఎంలో బిజీబిజీ..

Sat,January 20, 2018 03:23 AM

-రెండో రోజూ సందర్శించిన స్టార్ ప్రతినిధులు
-మిల్లు ఆస్తులు, యంత్రాల పనితీరుపై ఆరా
-వారి వెంటే ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
-ముడిసరుకు ఉంటే ఇప్పటికప్పుడు
ప్రారంభించవచ్చన్న బృందం
కాగజ్‌నగర్, నమస్తే తెలంగాణ : పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లును ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్టార్ పేపర్ మి ల్లు ప్రతినిధులు శుక్రవారం రెండో రోజూ సందర్శించా రు. జనరల్ మేనేజర్ జేపీ సింగ్, జీఎం ఇంజినీరింగ్ మహేశ్వరి, ప్రాజెక్టు జీఎంలు అమువీర్, మిశ్ర స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో కలిసి వివిధ డిపార్ట్‌మెంట్ల ను కలియతిరిగారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మిల్లుతో పాటు క్వార్ట ర్లు, పెద్దవాగులోని పంప్‌హౌస్‌ను పరిశీలిస్తూ బిజిబిజీ గా గడిపారు. యంత్రాల పనితీరు, తదితర వివరాలను డిపార్ట్‌మెంట్ల ఇన్‌చార్జిలు, కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీఎం, సర్‌సిల్క్ మిల్లు ఆస్తుల గురించి ఎమ్మెల్యే కోనేరు కోనప్పను అడిగి తెలుసుకున్నారు. సర్‌సిల్క్ మిల్లు ఆస్తులు లిక్విడేటర్ (కోర్టు) పరిధిలో ఉన్నందున, వాటిని కూడా తీసుకునేందుకు ఎవరైనా ముందుకు వస్తే ప్రభుత్వం, లిక్విడేటర్‌తో మాట్లాడుతానన్నారు. ఈ సందర్భంగా సిర్పూర్ పేపర్ మిల్లులో రికవరీ బాయిలర్ బాగానే ఉందనీ, ముడి సరుకులు అందుబాటులో ఉన్నట్లయితే ఇప్పటికిప్పుడే ఉత్పత్తిని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని స్టార్ పేపర్ మిల్లు కంపెనీ ప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు.
తెరచుకుంటున్న పాన్ టేలాలు
ఇన్నాళ్లూ మిల్లు గేటు ఎదుట మూసి ఉన్న పాన్‌టేలాలు తిరిగి తెరచుకుంటున్నాయి. మిల్లు మూసివేతతో పలువురు గిరాకీ లేక ఉపాధి కోల్పోయారు. తిరిగి మిల్లును తెరిపించేందుకు పలు కంపెనీల ప్రతినిధులు వచ్చి సందర్శిస్తుండడంతో సందడి వాతావరణం నెలకొంటుంది. దీంతో పాన్ టేలాల యజమానులు మిల్లును పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మిల్లును తెరిపిస్తే కార్మికులతో పాటు పరోక్షంగా తమకూ ఉపాధి దొరుకుతుందని పలువురు వ్యాపారులు పేర్కొంటున్నారు.

128
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles