సర్వే మొదలైంది..


Fri,January 19, 2018 12:52 AM

-పాత నేరస్తుల సమగ్ర సర్వే ప్రారంభం
-వివరాల సేకరణలో జిల్లా పోలీసులు
-ఇంటింటికి తిరుగుతూ.. వివరాలు సేకరిస్తూ..
-ఆసిఫాబాద్, వాంకిడిలో ఎస్పీ కల్మేశ్వర్
-జిల్లా వ్యాప్తంగా పాత నేరస్తుల డాటా ఆన్‌లైన్

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లావ్యాప్తంగా పాత నేరస్తుల సమగ్ర సర్వే ప్రారంభమైంది. పోలీసు యంత్రాంగం పాత నేరస్తుల ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించారు.. గురువారం ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ సబ్ డివిజన్ల పరిధిలోని 15 పోలీస్‌స్టేషన్ల పరిధిలో పాత నేరస్తులను గుర్తించే పనిలో పడ్డారు. జిల్లా వ్యాప్తంగా 2800 మంది పాత నేరస్తుల సమచారం సేకరించనున్నారు.. నేరస్తుల ఇండ్లకు జియోట్యాగింగ్ చేసి .. వివరాలు ఆన్‌లైన్‌లో పొందు పర్చనున్నారు.. వాంకిడి మండలంలోని ఇందాని, జిల్లా కేంద్రంలోని రవిచంద్రకాలనీలో నిర్వహించిన సర్వేలో ఎస్పీ కల్మేశ్వర్ సింగన్‌వార్ పాల్గొన్నారు.

నేర రహిత తెలంగాణే ధ్యేయంగా పోలీసులు చేపట్టిన పాత నేరస్తుల సమగ్ర సర్వే గురువారం జిల్లా లో ప్రారంభమైంది. జిల్లాలోని 15 మండలాల్లోని పోలీస్ స్టేషన్ల పరిధిలో పదేండ్లుగా వివిధ కేసుల్లో నమోదైన నేరస్తుల వివరాలతో పోలీసులు సమగ్ర సర్వే చేపట్టారు. నేరస్తుల ఇండ్ల వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. జిల్లాలో రికార్డుల ప్రకారం అ న్ని రకాల నేరాలు కలిపి, 2800 మంది నేరస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో మొదటి రోజు సుమారు 177మంది ఇండ్ల వద్దకు వెళ్లి, వివరాలు నమోదు చేసుకున్నారు. నేరస్తుల స్థితిగతులతోపా టు ఆధార్ కార్డు, ఓటరుకార్డు, రేషన్‌కార్డు నంబ ర్, మొబైల్ నెంబర్ వంటి వివరాలు సేకరించారు. వాంకిడి మండలం ఇందానిలో నిర్వహించిన నేరస్తుల సర్వేలో ఎస్పీ కల్మెశ్వర్ సింగన్‌వార్ పాల్గొని వివరాలు సేకరించారు.

సమగ్ర వివరాల సేకరణ..

జిల్లాలో వివిధ కేసుల్లో నమోదై ఉన్న పాత నేరస్తు ల సమగ్ర వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ప్రతి నేరస్తుడి ఇంటికి వెళ్లి, అతడు చేసిన నేరం.. కేసులు.. ప్రస్తుత పరిస్థితి.. కుటుంబసభ్యుల వివరాలను నమోదు చేసుకున్నారు. నేరస్తుడి ఫోటో, వేలిముద్రలు సేకరిస్తున్నారు. ఇదేకాకుండా నేరస్తుడి ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, మొబైల్‌నెబరు, ఓ టర్ గుర్తింపు కార్డులనే తీసుకుంటున్నారు. నేరస్తు ని ఇంటిని జియోట్యాగింగ్ చేస్తున్నారు. దీంతో పా టు నేరస్తుడి లో మార్పులనూ, కుటుంబసభ్యుల వివరాలను సమగ్రంగా నమోదు చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో సర్వే ముగుస్తుందని అధికారులు తెలిపారు.

జిల్లాలో 2800 మంది నేరస్తులు...

జిల్లాలో పదేండ్ల కాలంలో సుమారు 2237 మం ది వివిధ కేసుల్లో నేరస్తులుగా ఉన్నట్లు రికార్డుల ఆధారంగా పోలీసులు గుర్తించారు. మొదటి రోజు సుమారు 177 మందికి ఇండ్లలోకి వెళ్లి వివరాల ను సేకరించారు. పాత కేసుల ఆధారంగా ఆసిఫాబాద్ మండలంలో 222, లింగాపూర్‌లో 33, సి ర్పూర్-యులో 40, జైనూర్‌లో 192, కెరమెరిలో 111, వాంకిడిలో 227, రెబ్బనలో 205, తిర్యాణిలో 161, కాగజ్‌నగర్‌లో 280, కౌటాలలో 20 3, చింతలమానేపల్లిలో 11, బెజ్జూర్‌లో 75, దహెగాంలో 171, పెంచికల్‌పేట్‌లో 77, సిర్పూర్-టి లో 231 మంది నేరస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఈ నేరస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. సర్వేలో పోలీసు శా ఖకు సంబంధించిన అధికారులు పూర్తిస్థాయిలో వివరాలను సేకరిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన మం డలాల్లో కొంత సిబ్బంది కొరత ఉన్నప్పటికి నేరస్తుల పూర్తి వివరాలను సమగ్రంగా సేకరిస్తున్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...