ఎస్పీఎంలో స్టార్

Fri,January 19, 2018 12:51 AM

-మిల్లును సందర్శించిన ఉత్తరప్రదేశ్ కంపెనీ ప్రతినిధులు
-డిపార్ట్‌మెంట్లు, మిల్లు ఆస్తుల పరిశీలన
-యంత్రాల పనితీరుపై వివరాల సేకరణ
-వివరించిన ఇన్‌చార్జిలు
-ఎమ్మెల్యే కోనప్ప, కార్మికులతోనూ ప్రత్యేక సమావేశం
-నేడూ కొనసాగనున్న పర్యటన
-వరుసగా పరిశ్రమల అధికారుల రాకతో కార్మికుల్లో ఆశలు
కాగజ్‌నగర్, నమస్తే తెలంగాణ: సిర్పూర్ పేపర్ మిల్లును ఉత్తర ప్రదేశ్‌లోని స్టార్ పేపర్ మిల్లు ప్రతినిధులు జనరల్ మేనేజర్ జేపీ సింగ్, జీఎం ఇంజినీరింగ్ మహేశ్వరి, ప్రాజెక్టు జీఎంలు అమువీర్, మిశ్రా గురువారం సందర్శించారు. ప్రతి డిపార్ట్‌మెంట్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. మిల్లు ఆస్తులు, యంత్రాల పనితీరు, ప్రస్తుత స్థితిగతులు, తదితర వివరాలను ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఇన్‌చార్జిలను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం కూడా వీరి పర్యటన కొనసాగనుండగా, వరుసగా వివిధ కంపెనీల అధికారుల రాకతో ఎస్పీఎం పునరుద్ధరణపై కార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

కాగజ్‌నగర్‌లో షెట్ డౌన్ పేరుతో మూసి ఉన్న ఎస్పీఎంను గురువారం ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికి చెందిన స్టార్ పేపర్ మిల్లు ప్రతినిధులు సందర్శించారు. ఉదయాన్నే కాగజ్‌నగర్‌కు చేరుకున్న సా ర్ కంపెనీ జనరల్ మేనేజర్ జేపీ సింగ్, జీఎం ఇంజినీరింగ్ మహేశ్వరి, ప్రాజెక్ట్ జీఎంలు అమువీర్, మిశ్రా ముందుగా, ఎస్పీఎం గెస్ట్‌హౌస్‌లో ఎమ్మెల్యే కోనప్పతో పాటు మిల్లు కార్మికులు, ఉద్యోగులతో సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనప్ప రాష్ట్ర సర్కారు ప్ర వేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానాన్ని వారికి వివరించారు. దీంతో సంతృప్తి వ్యక్తం చేసిన ప్రతినిధులు అ నంతరం మిల్లులో పలు విభాగాలను, డిపార్టుమెంట్లను, యంత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయా డిపార్టుమెంట్ల వద్ద ఉన్న ఇన్‌చార్జిలతో పాటు కార్మికులతో మాట్లాడారు. యంత్రాల పని తీరు, ఉత్పత్తి తదితర విషయాలను అడిగి తెలుసుకొని, నమోదు చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని స్టార్ పేపర్ మిల్లులోని సదుపాయాలు, ఇక్కడి సదుపాయాలను బేరీజు వేసుకున్నా రు. ఎస్పీఎంలోని అన్ని విభాగాలను పరిశీలించిన అనంతరం తీసుకునే చర్యలపై చర్చించి, ఐఆర్‌పీ (ఇంటీరి యం రిజుల్యుషన్ ప్రొఫెషనల్స్)కి చేపట్టనున్న యాక్షన్ లో పాల్గొనున్నట్లు వెల్లడించారు. వారి వెంట ఎమ్మెల్యే కోనప్పతో పాటు మిల్లు కార్మికులు, ఉద్యోగులు ఉన్నారు.

వరుస ప్రతినిధుల రాక కార్మికుల్లో ఆశలు..
ఎస్పీఎంను పలు కంపెనీల ప్రతినిధులు వరుసగా సందర్శిస్తుండడంతో కార్మికుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. పట్టణంలో ప్రస్తుతం ఏ కార్మికుడి నోటా, కార్మిక వాడల్లో, వారి కుటుంబాల్లో కూడా మిల్లు పునరుద్ధరణ చర్చే సాగుతున్నది. ఈ సందర్భంగా రాష్ట్ర సర్కారుతో పాటు ఎమ్మెల్యే కోనప్ప తీసుకుంటున్న చర్యలను అభినందిస్తున్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో ఒడిశా రాష్ట్రంలోని రాజ్‌ఘడ్‌కు చెందిన జేకే ( జగన్ కిషన్ సింఘానియా) పేపర్ మిల్లు ప్రతినిధులు యూనిట్ హెడ్ పీకే సూరి, చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.జిందాల్, డిప్యూటీ జీఎం ఎంవీ రాజా, డీజీఎం ఆర్‌ఎస్ సింగ్, జనరల్ మేనేజర్ భట్, ఐఆర్‌పీ మనోజ్ బాజ్‌పాయిలు మిల్లును రెండు రోజుల పాటు సందర్శించి నివేదికలు తయారు చేసుకున్నారు. అలాగే ఈ నెల 13, 14 కర్ణాటక రాష్ట్రంలోని ఈస్ట్ కోస్ట్ పేపర్ మిల్లు( దండెల్లి పేపర్ మిల్లు) ప్రతినిధులు ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ (ఈడీ) లకోటియా, వెస్ట్‌కోస్ట్ కంపెనీ ప్రెసిడెంట్ రాఠి, వైస్‌ప్రెసిడెంట్ సోమాని, ఉమేశ్‌అగర్వాల్, జీఎం నారాయణశెట్టి, మేనేజర్ ఎండ్రిగిచ్,శుక్లా, గోయెల్, వర్మ, ఐఆర్‌పీ అనుజ్ బాజ్‌పెయ్, ఐడీబీఐ ప్రతినిధి ప్రదీప్‌బాబులతో కలిసి మిల్లును సందర్శించగా తాజాగా గురువారం ఉత్తరప్రదేశ్‌లోని స్టార్ పేపర్ మిల్లు ప్రతినిధులు సందర్శించారు.

మిల్లును తెరిపించి ఆదుకుంటాం: ఎమ్మెల్యే కోనప్ప
ఎస్పీఎంను పునరుద్ధరించి కార్మికులను, వారి కుటుంబ సభ్యులను ఆదుకుంటామని ఎమ్మెల్యే కోనప్ప అన్నారు. గురువారం ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికి చెందిన స్టార్ కంపెనీ ప్రతినిధులు మిల్లు సందర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మిల్లును తెరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఐటీ మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారనీ, ఇందులో భాగంగానే వారం రోజులుగా వరుసగా జేకే, వెస్ట్‌కోస్ట్, స్టార్ పేపర్ మిల్లులకు చెందిన ప్రతినిధులు మిల్లును సందర్శించారన్నారు. ఫిబ్రవరి నెలాఖరు కల్లా మిల్లు భవిష్యత్ ఓ కొలిక్కి వస్తుందనీ, కార్మికులు అధైర్యపడొద్దనీ, త్వరలోనే మంచి రోజులు రానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన వెంట కార్మికులు, యూనియన్ నాయకులు కూశన రాజన్న, రాజేశ్వర్, విజయ్‌యాదవ్, గడదాసు మల్లయ్య, గడదాసు నారాయణ, రమణ, కృష్ణ తదితరులు ఉన్నారు.

95
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles