ఈ పాస్‌తో అక్రమాలకు చెక్


Fri,January 19, 2018 12:49 AM

-నేరుగా లబ్ధిదారుడికే రేషన్ సరుకులు
-జేసీ అశోక్ కుమార్
-కాగజ్‌నగర్ డివిజన్‌లోని డీలర్లకు యంత్రాలపై అవగాహన సదస్సు
కాగజ్‌నగర్ రూరల్ : రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా ఉండేందుకే ప్ర భుత్వం ఈపాస్ విధానం అమల్లోకి తీ సుకువస్తున్నదని జేసీ అశోక్ కుమార్ అన్నారు. గురువారం కాగజ్‌నగర్ ఎంపీడీఓ కార్యాలయంలో డీలర్లకు ఈపాస్ విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఫిబ్రవరి 1 నుంచి అన్ని రేషన్ దుకాణాల్లో ఈ పాస్ విధానం అమలుకు కార్యచర ణ రూపొందించిందన్నారు. ఈ వి ధానంతో నిత్యావసర సరకులు నే రుగా లబ్ధిదారుడికి అందుతాయన్నారు. అంతేగాకుండా డీలర్ల వద్ద నిల్వలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదవుతాయన్నారు. ఈ యంత్రంలో లబ్ధిదారుడి ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేయగానే కుటుంబ సభ్యుల వివరాలు కనబడుతాయనీ, కుటుంబంలో ఎవరైనా వచ్చి వేలి ముద్రను వేయగానే ఎంతమేర స రుకులు ఇవ్వాలని సూచిస్తుందన్నా రు. ఈ పాస్ యంత్రాన్ని వేమిషన్ కు అనుసంధానం చేయనున్నట్లు తె లిపా రు. అనంతరం రేషన్ డీలర్లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా లబ్ధిదారుడి వివరాలను ఎలా న మోదు చే యాలో వివరించారు. అనంతరం డి విజన్ పరిధిలో 150 మంది డీలర్లకు ఈపాస్ యంత్రాల ను అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో రమేశ్‌బాబు, జిల్లా సివిల్ సైప్లె అధికారి సత్యనా రాయణ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సివి ల్ సైప్లె వి శ్వనాథ్, కాగజ్‌నగర్ తహసీల్దార్ రాంమ్మోహన్, గోపాల్, ఆర్. ఐ రాంలాల్, డీలర్లు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...