గర్భిణులకు పోషకాహారం అందజేత

Fri,January 19, 2018 12:48 AM

దహెగాం: గర్భిణుల ఆరోగ్య క్షేమం కోసమే కోనేరు ట్రస్ట్ ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నట్లు జడ్పీటీసీ లావుడె సుజాత అన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్తహీనత ఉన్న 25 మంది గర్భిణులకు రాగులపిండి, బెల్లం, పల్లిపట్టీలతో తయారు చేసిన పోషకాహారం కిట్లు అందజేశారు. ఆమె మట్లాడుతూ గర్భిణులు అవకాశాన్ని వినియోగించుకుని ఆరోగ్యంగా జీవించాలని సూచించారు. పేదల అభ్యున్నతికి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో ట్రస్ట్ ద్వా రా సేవలు అందిస్తున్నరని తెలిపారు. సర్పంచ్ వెలుములు జయందర్, సింగిల్‌విండో ఉపాధ్యక్షుడు తిరుపతిగౌడ్, టీఆర్‌ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ప్ర సాద్‌రాజ్, వైద్యసిబ్బంది హెచ్‌వీ రేణుకాదేవి, హెల్త్ అసిస్టెంట్ ఓదెలు, నాయకులు ధనుంజయ్, బాలునాయక్, రోషన్, ప్రకాష్‌గౌడ్, తిరుపతి, దాసు, తదితరులు పాల్గొన్నారు.

పెంచికల్‌పేట్: కోనేరు కోనప్ప తనయుడు, కోనేరు ట్రస్ట్ చైర్మన్ కోనేరు వంశీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గ ర్భిణులకు పౌష్టికాహార కిట్లను అందజేశారు. నాలుగోసారి పంపిణీ చేస్తున్నామన్నారు. బెల్లం, పల్లీపట్టి, తదితర వస్తువులతో ఆరు కిలోల కిట్టుని అందిస్తున్నామన్నారు. సర్పంచ్ అజ్మీర పరమేశ్వర్, ఎంపీటీసీ సాజీద్, కౌన్సిలర్, రాచకొండ గిరీశ్‌కుమార్, డాక్టర్ రాజు, సీహెచ్‌ఓ కరుణ, టీఆర్‌ఎస్ యువజన సంఘం మండలాధ్యక్షుడు చౌదరి తిరుపతి, నగునూరి శ్రీనివాస్, సింగిల్ విం డో డైరెక్టర్ దూగుంట రాజన్న, సిరిపు రం సదాశివ్, వైద్యసిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles