ప్రసవాల సంఖ్య పెంచాలి


Fri,January 19, 2018 12:48 AM

-కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
-ప్రభుత్వ దవాఖాన పరిశీలన
-రికార్డుల పరిశీలన
-సిబ్బందికి సూచనలు
ఆసిఫాబాద్ రూరల్: ప్రభుత్వ దవా ఖానలో ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ దవాఖానను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి వార్డును పరిశీలించి రోగులను పరామర్శించి వా రికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులు పరిశీలించి వైద్యాధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. విధుల పట్ల అంకిత భావంతో పనిచేస్తూ రోగులకు మెరుగైన సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. దవాఖానలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను సూపరింటెండెం ట్‌ను అడిగి తెలుసుకున్న ఆయన డి ప్యూటేషన్‌పై వెళ్లిన వారిని వెంటనే తిరి గి రప్పించాలని ఆదేశించారు. జిల్లా ద వాఖాన నుంచి ఎవరిని ఎక్కడికి డిప్యుటేషన్‌పై పంపించవద్దన్నారు. దవాఖానలో ప్రసవాల సంఖ్య చాలా తక్కువగా ఉందనీ, పెంచేలా వైద్యాధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నా రు. ప్రజలు ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలకు చేరువయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాలింతల వార్డులో ఏసీ సౌకర్యం కల్పించాలనీ, ఏవైనా పరికరా ల అవసరం ఉంటే వెంటనే ప్రతిపాదనలు పంపించాలన్నారు. ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలనీ, తాగునీటి సౌక ర్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవలన్నారు. చిన్న పిల్లలకు స్నానం చేయించేందుకు వార్డుల్లో సో లార్ వాటర్ హీటర్ ఏర్పాటు చేయాలన్నారు. దవాఖానలో ఖాళీగా ఉన్న పో స్టులను త్వరలో భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అ నంతరం జిల్లా వైద్య , ఆరోగ్య శాఖ కా ర్యాలయాన్ని తనిఖీ చేశారు. తనిఖీలో ఆయన వెంట డీఆర్వో సురేశ్ కదం, జిల్లా వైద్యాధికారి సుబ్బారాయుడు, తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...