ఎస్పీఎంలో రెండో రోజు


Wed,January 17, 2018 11:47 PM

కాగజ్‌నగర్‌టౌన్ : కాగజ్‌నగర్‌లోని సిర్పూరు పేపరు మిల్లును కర్ణాటకకు చెందిన వెస్ట్‌కోస్ట్ (దండెల్లి పేపర్ మిల్లు) కంపెనీ ప్రతినిధులు, ఎస్పీఎం మాజీ ఈడీ లకోటియా, వెస్ట్‌కోస్ట్ కం పెనీ ప్రెసిడెంట్ రాఠి, వైస్‌ప్రెసిడెంట్ సోమాని, ఉమేశ్‌అగర్వాల్, జీఎం నారాయణశెట్టి, మేనేజర్ ఎండ్రిగిచ్,శుక్లా, గోయెల్, వర్మ, ఐఆర్‌పీ అ నుజ్ బాజ్‌పేయ్, ఐడీబీఐ ప్రతినిధి ప్రదీప్‌బాబు బుధవారం రెండో రోజూ సందర్శించారు. గత మేనేజ్‌మెంట్ విభాగంలో ఈడీగా పని చేసిన లకోటియాకు మిల్లుపై పూర్తి పట్టుఉంది. మిల్లులోని పేపరు మిషన్ 1,2ను చూసిస్తూ, వాటి పనితీరును వారికి వివరించారు. ఈ యంత్రాల తో అన్‌బ్లీచ్డ్, లెడ్జర్ పేపరు, మాల్ట్ పేపర్లతో పా టు మరో 100 రకాల పేపర్లను ఉత్పత్తి చేసి దేశ విదేశాలకు సరఫరా చేశారని తెలిపారు.

1,2 యంత్రాలు కేవలం దేశంలో మూడు మాత్రమే ఉండగా, అవి బల్లార్షా, రాయ్‌పూర్, కాగజ్‌నగర్‌లో ఉన్నాయన్నారు. షట్‌డౌన్ పేరిట మూడేళ్లక్రితం ఎస్పీఎంలో ఉత్పత్తి నిలిపివేశారనీ, దీంతో కొత్తగా ఏర్పడ్డ పలు కాగితపు పరిశ్రమలు ఎంతో అభివృద్ధి చెందాయని చెప్పారు. పేపరు మిషన్ 4,5 లలో లెడ్జర్ షీట్, ఛార్ట్ పేపర్, బాండ్ పేపర్‌ను ఉత్పత్తి చేయడమే కాకుండా శ్రీలంక దేశానికి కూడా పేపరు సరఫరా చేశారని వెస్ట్‌కోస్ట్ కంపెనీ ప్రెసిడెంట్ రాఠికి వివరించారు. అంతకుముందు డీఎం ప్లాంట్‌ను పరిశీలించారు. నీటి శుద్ధీకరణ విధానాన్ని సంబంధిత డిపార్టుమెంట్ ఇన్‌చార్జిని అడిగి తెలుసుకున్నారు. పేపరు మి షన్ 6,7,8 యంత్రాల గురించి తెలుసుకున్నా రు. అనంతరం పెద్దవాగు సమీపంలోని పంప్‌హౌస్‌ను పరిశీలించి, కంపెనీకి నీటి సరఫరా చేసే విధానాలపై ఆరాతీశారు. మిల్లుకు రెండు కిలోమీటర్ల దూరంలోని పంప్‌హౌస్ నుంచి పంపింగ్ ద్వారా మిల్లు సమీపంలోని ఫిల్టర్ బెడ్‌లో నీటిని నిలువ చేసి బూస్టింగ్ చేసిన అనంతరం మిల్లులోని డీఎం ప్లాంట్‌కు నీటిని సరఫరా చేస్తారని పేర్కొన్నారు.

అనంతరం ఎమ్మెల్యే కోన ప్ప కంపెనీకి కావాల్సిన ముడి సరుకు బొగ్గు, నీరు, కర్ర, విద్యుత్ రాష్ట్రంలో సమృద్ధిగా ఉన్నాయని, మి ల్లుకు రైలు సౌకర్యం కూడా ఉందని వారికి వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో 2.25వేల టన్నుల కర్ర అందుబాటులో ఉందని, కంపెనీ పునరుద్ధరించినట్లయితే ఆరు నెలలకు సరిపడా ముడిసరకు ఉందని చెప్పారు. వీరి వెంట కార్మికులు రాజేశ్వర్‌రావు,విజయ్ యాదవ్, రాజన్న, మురళీకృష్ణ, రమణ, విజయ్, కృష్ణారెడ్డి, మల్లయ్య, వెంకన్న, తదితరులు ఉన్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...