అభివృద్ధి బాటలు


Wed,January 17, 2018 11:47 PM

వాంకిడి: గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టిన రాష్ట్ర సర్కారు, వాటిని వడివడిగా నిర్మిస్తూ, రవాణా కష్టాలను దూరం చేస్తున్నది. గత పాలకుల హ యాంలో మండలంలోని పలు గ్రామాలకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ గ్రామాలకు రోడ్ల నిర్మాణం పూర్తవుతుండడంతో, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మితో పాటు స్థానిక ప్రజా ప్రతినిధుల కృషి వల్లే తమ గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగైందని చెబుతున్నారు. వాంకిడి రోడ్డు నుంచి మోకాసిగూడ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రధాన మంత్రి సడక్ యోజన పథకం ద్వారా రూ. 4,27 కోట్లు మంజూరయ్యాయి. వాంకిడి నుంచి చౌపన్‌గూడ వరకు తొమ్మిది కిలో మీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రధాన మంత్రి సడక్ యోజన కింద రూ. 4,17 కోట్లు, సోనాపూర్ నుంచి రాజుల్‌గూడ వరకు బీటీ రోడ్డు కోసం రూ. 58. 50లక్షలు, వంతెన కోసం సీఆర్‌ఆర్ నిధుల నుంచి రూ. 82లక్షలు మంజూరు కాగా, వాంకిడి నుంచి ఖమాన బీటీ రోడ్డు కోసం రూ. 10 లక్షలు, వాంకిడి జడ్పీరోడ్డు నుంచి సావతి, దాభా రోడ్డు మరమ్మతులకు గానూ పంచాయతీరాజ్ నిధుల ద్వారా రూ. 58లక్షలు మంజూరు చేశారు. బంబార నుంచి గోండుకోసార గ్రామం వరకు రోడ్డు రూ. 30లక్షలు, గణేశ్‌పూర్ రోడ్డు నుంచి సో నాపూర్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి వనబంధు క ల్యాణ్ యోజన పథకం కింద రూ. 1. 50కోట్లు, ఆర్లి నుంచి మర్కగూడ వరకు బీటీ కోసం ఐటీడీఏ ద్వారా రూ. 40 లక్షలు, లక్ష్మీపూర్ నుంచి వెల్గి వరకు బీటీ రోడ్డు కోసం నియోజకర్గం అభివృద్ధి నిధుల నుంచి రూ. 1. 75కోట్లు మంజూరయ్యాయి. అలాగే అసంపూర్తిగా ఉన్న ఖమాన వంతెన కోసం రూ. 3.50కోట్లు మంజూరయ్యాయి. ఇందు లో సోనాపూర్, మార్కగూడ బీటీ రోడ్డు పనులు జరుగుతుండగా, లక్ష్మిపూర్ వెల్గి బీటీ రోడ్డు పనులు టెండర్ పక్రియ పూర్తైంది. కాగా తర్వలోనే వీటి పనులు చేపట్టనున్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...