సబ్సిడీ గొర్రెలు పట్టివేత


Wed,January 17, 2018 11:47 PM

కాగజ్‌నగర్, నమస్తే తెలంగాణ: గొల్ల, కు ర్మల సంక్షేమం కోసం రాష్ట్ర సర్కారు అందిం చిన సబ్సిడీ గొర్రెలు మహారాష్ట్రకు తరలిస్తు న్న వ్యాన్‌ను సిర్పూర్(టి) మండలంలోని వెంకట్రావు పేట సమీపంలో ఎమ్మెల్యే కోన ప్ప పట్టుకున్నారు. మందమర్రి మండలానికి చెందిన రాయమల్లు 92 గొర్రెలను లబ్ధిదారు ల నుంచి కొనుగోలు చేసి మహారాష్ట్రకు విక్ర యించేందుకు వ్యాన్( ఏపీ 15 టీఏ 4141 )లో ఎక్కించుకుని సిర్పూర్(టి) మీదుగా త రలిస్తున్నారు. ఇదే క్రమంలో అదే రహదారి గుండా మహారాష్ట్రలోని చప్రాడ ఆధ్మాతిక కేంద్రానికి వెళ్తున్న సిర్పూర్ ఎమ్మెల్యే కు అ నుమానం వచ్చి వ్యాన్ డ్రైవర్, క్లీనర్‌లను ఆ పి, ప్రశ్నించారు. వారిపై అనుమానం రావ డంతో, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడికి చేరుకొ ని, వ్యాన్‌లో 92 గొర్రెలను తరలిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే రాయమల్లుతో పాటు వ్యాన్ డ్రైవర్ సమ్మయ్య, హెల్పర్ సాయి లుపై కేసు నమోదు చేసి, గొర్రెలను స్వాధీ నం చేసుకున్నారు. గొర్రెల లబ్ధి దారులను వెంటనే గుర్తించి, చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కలెక్టర్‌ను కోరారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...