సేవా కార్యక్రమాల్లో ముందుండాలి


Wed,January 17, 2018 11:47 PM

వాంకిడి: విద్యార్థులు చదువుతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుం డాలని కళాశాలల జిల్లా నోడల్ అధికారి బి గోపాల్ అన్నారు. వాంకిడి మండల కేం ద్రంలో జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో వారం రోజుల నుంచి కొనసాగుతున్న శ్రమదానంబుధవారం ముగిసింది. ఈ సందర్భంగా ప్రభుత్వం కళా శాలలో ఏర్పాటు చేసిన ముగింపు సమావేశంలో కళాశాలల జిల్లా నోడల్ అధికారి గోపాల్ పాల్గొని విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడారు విద్యార్థి స్థాయి నుంచే సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా క్రమశిక్షణతో పాటు గ్రామీణ ప్రజల జీవన వి ధానం పై అవగాహన ఏర్పడుతుందన్నారు. ఇంటర్‌తో పాటు ఇతర ఉన్నత చదువు ల్లో కొనసాగే విద్యార్థులు జాతీయసేవా పథకంలో వలంటీర్లుగా ఉండి ఎన్నో ప్ర యోజనాలు పొందవచ్చుననీ, ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా సర్టిఫికెట్లు పొందిన విద్యార్థులు భవిష్యత్తులో ఆర్మీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరేందుకు ఉపయోగప డుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రొగ్రాం అధికారి చంద్రయ్య, కళాశాల ప్రిన్సిపాల్ మాధవరావు, అధ్యాపకులు కిరణ్, మురళి, తిరుపతి, రాజ్‌మౌళి, స త్యం, సంతోష్, సురేందర్, పూర్ణచందర్, శ్రీనివాస్ తదితరులున్నారు,

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...