ప్రతిపాదనలు సిద్ధం చేయాలి


Wed,January 17, 2018 11:47 PM

ఆసిఫాబాద్ రూరల్ : జిల్లాలో నూతన గ్రామపంచాయతీల ఏర్పాటుకు ఈనెల 23లోగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ ఆదేశించారు. బుధవారం తన కార్యాలయ సమావేశమందిరంలో ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సర్వేయర్లతో ఆయ న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో 173 పంచాయతీలు ఉండగా, కొత్తగా 300, 500 జనాభా గల పాత పంచాయతీకి 1 కి.మీ. దూరంలో ఉన్న హాబిటేషన్లను కొత్త గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. ఏజెన్సీ మండలాల్లో 100 శాతం ఎస్టీ జనాభా ఉన్న గ్రామాలను ట్రైబల్, నాన్ ట్రైబల్ హాబిటేషన్లను గుర్తించి ప్రతిపాదనలను తన కార్యాలయానికి పంపాలన్నారు. గ్రామపంచాయతీలుగా ఉన్న గ్రామాల్లో జనాభా అధికంగా ఉంటే నగర పంచాయతీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ అశోక్ కుమార్, ఆర్డీవోలు సురేశ్ కదం, రమేశ్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...