వేర్వేరు చోట్ల అనుమానాస్పద స్థితిలో ఇద్దరు మృతి


Tue,January 16, 2018 11:55 PM

కౌటాల: మండల కేంద్రంలో అనుమానాస్పద స్థితిలో ఒకరు మృతి చెందినట్లు ఎస్‌ఐ అశోక్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. వడ్డీ వెంకటరమణ మూడేండ్లుగా రాంకీ కంపెనీలో స్టోర్ కీపర్‌గా పనిచేస్తు న్నాడు. ఆయన స్వగ్రామం ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం గ్రామం. సంక్రాంతి పండుగకు ఇంటికి వస్తున్నట్లు ఫోన్‌లో కుటుంబ సభ్యులకు చెప్పాడు. కానీ శనివారం నుంచి ఆయన సెల్‌ఫోన్ పనిచేయ కపోవడంతో కుటుంబసభ్యులు కౌటాలలో అద్దెకు ఉండే ఇంటి యజ మానికి ఫోన్ చేశారు. తాను ఇతర వ్యక్తులను ఇంటికి వెళ్లి చూడమనగా గదిలో వెంకట రమణ చనిపోయి దుర్వాసన వస్తున్నట్లు గుర్తించారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బావ శివకోటి చక్రం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వెంటకరమణకు భార్య వీరవేణి, ఇద్దరు కుమా రులున్నట్లు ఆయన తెలిపారు..

జైనూర్: మండలంలోని తుకుడ్‌పల్లి గ్రామానికి చెందిన కొరెంగ భీంరావ్ అనుమానాస్పదంగా మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భీంరావ్ గత ఆదివారం పనుల కోసమని ఇంటి నుంచి వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబసభ్యు లు వెతికినా అతడి ఆచూకీ దొరకలేదు. సోమవారం సాయంత్రం భీం రావు మృతదేహమై కనిపించాడు. మృతదేహం పక్కన పురుగుల మం దు ఉండడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్లు ఏఎస్‌ఐ ఊషన్న తెలిపారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS