ఎమ్మెల్యేకు వినతి


Tue,January 16, 2018 11:54 PM

ఆసిఫాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రాం కాంస్య విగ్రహం ఏర్పాటుతో పాటు భవన నిర్మాణానికి రెండున్నర ఎకరాల స్థలం కేటాయించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు రేగుంట కేశవరావు మాట్లాడుతూ ఎస్సీలకు కమ్యూనిటీ హాల్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. భవనం లేక సభలు, సమావేశాలు చెట్ల కింద పాత భవనాల్లో నిర్వహించుకోవాల్సి వస్తున్నదని వినతిలో పేర్కొన్నారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ బాబు జగ్జీవన్‌రాం కాంస్య విగ్రహం ఏర్పాటుతో పాటు కమ్యూనిటీ భవన నిర్మాణానికి స్థలం మంజూరుకి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు గణేశ్, వెంకటేశం, సత్తయ్య, ప్రభాకర్, సాయి తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...