కందికి రందిలేదు!


Thu,January 12, 2017 02:09 AM

-కొనుగోళ్లకు సర్కారు సిద్ధం
-మద్దతు ధరక్వింటాల్‌కురూ.5,050
-నేటి నుంచిజిల్లా కేంద్రంలో కొనుగోళ్లు

ఆసిఫాబాద్,నమస్తే తెలంగాణ:కంది రైతులకు శుభవార్త. క్వింటాల్‌కు రూ. 5050 చెల్లించి ఎఫ్‌సీఐ, మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కేంద్రంలోని మార్కెట్‌యార్డులో గురువారం నుంచి కొనుగోళ్లు చేపట్టనుంది.

కంది రైతులకు శుభవార్త..


ఎఫ్‌సీఐ, మార్క్‌ఫెడ్ పంట ఉత్పత్తుల ను కొనుగోలు చేయనున్నాయి. క్వింటాల్‌కు 5050 మద్దతు ధరగా నిర్ణయించాయి. జిల్లా కేం ద్రంలోని మార్కెట్ యార్డులో గురువారం నుంచి కొనుగోల్లు ప్రారంభిస్తారు. పంటను అమ్ముకోనేందుకు యార్డుకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు తీసుకు న్నారు. సరుకు నిల్వ ఉంచేందుకు అవసరమైన స్థలాన్ని ఏర్పాటు చేశారు. గిట్టుబాటు ధర కోసం ఈ-నామ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇం దుకు మార్కెట్ యార్డును కందుల కొనుగోలుకు అధికారులు సిద్ధం చేశారు. గురువారం నుంచి కం దుల కొనుగోళ్లు జరిపేందుకు మార్కెటింగ్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎఫ్‌సీఐ, మార్క్‌ఫెడ్ ద్వారా వీటిని కొనుగోలు చేయనున్నారు. కొనుగోళ్ల సందర్భంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సంబంధితశాఖ అధికారులు ఏర్పా ట్లు చేశారు. యార్డులోకి రైతులు తెచ్చిన సరుకును నిల్వ ఉంచేందుకు స్థలాన్ని ఏర్పాటు చేశారు.

క్వింటాలుకు 5050..


ప్రభుత్వం కందులకు మద్దతు ధర క్వింటాలకు 5050 ప్రకటించింది. ఈ కొనుగోళ్ల ప్రక్రియను మార్క్‌ఫెడ్ ద్వారా చేపట్టనున్నారు. గత సంవత్స రం 5 వేలుగా ఉంది. గతంతో పోలిస్తే ఈ ఏడా ది కంది పంట విస్తీర్ణం పెరిగింది. గతేడాది ధర ఎక్కవ ఉండడంతో కంది పంట వేసిన రైతులు మంచి లాభాలు అర్జించారు. ఈ సంవత్సరం ఎ క్కువ విస్తీర్ణంలో సాగు చేయడంతో నేటి నుంచి ఆసిఫాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో కంది కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS