అభయ హస్తం పింఛన్లు వచ్చేశాయ్..


Thu,January 12, 2017 02:09 AM

-రూ.57.73 లక్షలు విడుదల చేసిన ప్రభుత్వం
-తొమ్మిది నెలల ఎదురు చూపులకు తెర
-వారంలోగా ఖాతాల్లో జమ చేసే అవకాశం
-జిల్లాలో 1283 మందికి ప్రయోజనం
-హర్షం వ్యక్తం చేస్తున్న మహిళాలోకం
-రూ.57.73 లక్షలు విడుదల చేసిన ప్రభుత్వం
-తొమ్మిది నెలల ఎదురు చూపులకు తెర
-వారంలోగా ఖాతాల్లో జమ చేసే అవకాశం
-జిల్లాలో 1283 మందికి ప్రయోజనం
-హర్షం వ్యక్తం చేస్తున్న మహిళాలోకం

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ:తొమ్మిది నెలలుగా పెండింగ్‌లో ఉన్న అభయహస్తం పింఛన్ల సొమ్మును ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాకు రూ. 57.73 లక్షలు రాగా, 1283 మంది లబ్ధిదారులకు చెల్లించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఒక్కొక్కరి నెలకు రూ.500 చొప్పున మొత్తం రూ.4500 అందనుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఏడాదిగా ఎదు రు చూస్తున్న అభయ హస్తం డబ్బులను సర్కారు విడుదల చేసింది. రాష్ట్రంలోని 97 వేల మందికి 46 కోట్ల నిధులు మంజూరు చేసింది. వారంలోగా పింఛన్ డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కుమ్రంభీం జిల్లాలో 1283 మంది లబ్ధిదారులకు 57 లక్షల 73 వేల 500 చెల్లించానున్నారు. ఒక్కో పింఛన్ దారుడికి నెలకు 500 చొప్పున తొమ్మిది నెలలకు 4500 ఖాతాలో జ మకానున్నాయి.

గ్రామీణాభివృద్ధిశాఖ అధికారు లు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీడీవోల ఖాతాలకు ఈ నిధులు జమకాగానే పింఛన్ దారుల ఖాతాల్లోకి వారు జమ చేయనున్నారు. తెలంగాణ ఆవిర్భావం, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా త పేద ప్రజల జీవన ప్రమాణాలను దృ ష్టిలో పెట్టుకొని నెలకు వెయ్యి పింఛను పథకాన్ని ప్రవేశపెట్టింది. వికలాంగులకు 1500 చొప్పున చెల్లిస్తుంది. ఈ నేపథ్యంలో అభయహస్తం లబ్ధిదారులను కేసీఆర్ ప్ర వేశపెట్టిన పింఛను పథకంలోకి మార్పిడి చేశారు. ఈ క్రమంలో అభయహస్తం బకాయి లు చెల్లింపులు ఆలస్యమయ్యాయి. ఇది లా ఉండగా ప్రభు త్వం గతేడాది జనవరి వరకు బకాయిలను ఇది వ రకే చెల్లించింది. తాజాగా, గతేడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు తొమ్మిది నెలల పింఛన్‌ను మం జూరు చేసింది. ఏకకాలంలో విడుదల కావడంతో పింఛన్‌దారుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.

ఖాతాల్లో జమచేయిస్తాం


మంజూరైన అభయ హస్తం నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయించేందుకు ఆయా మండలాల ఎంపీడీవో లు కసరత్తు చేస్తున్నా రు. అభయ హస్తం పింఛన్ తీసుకునేవారు మహిళా సంఘాల సభ్యులు కనుక వారికి నేరుగా వారి ఖాతాల్లోనే తొమ్మిది నెలల పింఛన్ 4500 జమ చేస్తాం. వా రం రోజుల్లో వారి ఖాతాల్లో జమయ్యేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నాం.
- శంకర్, డీఆర్డీఓ, కుమ్రంభీం ఆసిఫాబాద్

ఆనందంగా ఉంది


ప్రభుత్వం ఒకేసారి తొమ్మిది నెలల పింఛన్ డబ్బులు ఇస్తున్నందు కు చాలా ఆనందంగా ఉంది. కొందరు పింఛ న్ రాదని చెప్పి బయపెట్టిన్రు. కేసీఆర్ సార్ అలా చేయడని మాకు తెలుసు. ఒకేసారి 4500 తీసుకోవచ్చు.
- హన్మక్క,గోలేటి,రెబ్బెన

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS