యాదవులు అన్ని రంగాల్లో ఎదగాలి


Thu,January 12, 2017 01:59 AM

-యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్‌రావ్
బెజ్జూర్ : యాదవులు అన్నిరంగాల్లో ఎదగాలని యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్‌రావు సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని రంగనాయక ఆలయంలో ఏర్పాటు చేసిన యాదవ సంఘం సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో యాదవులు అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నారన్నారు. మాదవుల అభివృద్ధి కోసం మండలాల్లో ప్రత్యేక భవనాలతో పాటు ప్రత్యేక వసతి గృహాలు, పాఠశాలలు ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుపేద యాదవులకు పింఛన్ మంజూరు చేయాలని కోరారు. యాదవ కులస్తులలో ఐక్యత ఏర్పడి హక్కుల సాధనకోసం పారాటం చేస్తామని అన్నా రు.

ఫిబ్రవరిలో జిల్లా కేంద్రంలో శంఖారావం నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. యాదవ సంఘా ల వారు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చే యాలని పిలుపునిచ్చారు. సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక అనంతరం మొట్ట మోదటి సారిగా ఆయన బెజ్జూర్‌కు వచ్చిన సందర్బంగా మండల యాదవులు ఆయనను శాలువలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మల్లయ్య, సురేశ్, శ్రీశైలం, ఉమ్మెర లింగయ్య, టీఆర్‌ఎస్ నాయకులు కే జగ్గాగౌడ్, సిర్పూరం సదాశివ్, కే ముత్తయ్య, ఆయా మండలాధ్యక్షుడు మండల నాయకులు ఉమ్మెర బాలకృష్ణ, రాజేశ్, బీ మహేశ్, కిషన్‌గోపాల్‌యాదవ్ పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS