సివిల్ సప్లయ్ గోదాం తనిఖీ

Thu,January 12, 2017 01:59 AM

బెజ్జూర్ : మండల కేంద్రంలోని ఎంఎల్‌ఎస్ పా యింట్ సివిల్ సప్లయ్ గోదాంను బుధవారం డీఎం భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సరుకలు, సంబంధిత రిజిష్టర్లను పరిశీలించారు. అనంతరం స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాయంలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వి ద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఎస్‌వో అనూషను ఆదేశించారు. వంటగది, వంటల కోసం నిల్వ ఉన్న కూరగాయలు ఇతర సామగ్రిని పరిశీలించారు. అంతకుముందు మండల కేంద్రంలో సహకార సంఘంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మారై హరిదాస్, బోధన సిబ్బంది, గోదాం సిబ్బంది గోపాల్ ఉన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...