అటవీ సంపదను కాపాడుకోవాలి


Thu,January 12, 2017 01:59 AM

-ఫారెస్ట్ రేంజ్ అధికారి నగవత్ స్వామి
కాగజ్‌నగర్ రూరల్ : అటవీ సంపదను కాపాడుకోవాలని ఫారెస్టు రేంజ్ అధికారి నగవత్ స్వామి అన్నారు. బుధవారం కాగజ్‌నరగ్ మండలంలోని కోసిని గ్రామంలో వన్యప్రాణుల సంరక్షపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ జంతువుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరిం చాలన్నారు. వన్య ప్రాణుల ద్వారా పంటలు దెబ్బతింటే ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అటవీ జంతువులను ఉచ్చులతో వేటాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అట వీ సంపదను, వన్యప్రాణులను సంరక్షిస్తూ అధికారులకు సహకరిస్తామని గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు.

అనంతరం గ్రామ సర్పంచు నగునూరు శ్రీనివాస్ మాట్లాడుతూ వన్య ప్రాణి సంరక్షణకు అందరూ కృషి చేయాలన్నారు. అనంతరం పెద్దపులి దాడిలో మృతి చెందిన పశువుల యజమానులు వడై దసృకు రూ 10వేలు, మడావి జంగుకు రూ 5 వేలు, పీ సింగ్‌కు రూ 3వేలు చెక్కులను ఫారెస్ట్ రేంజ్ అధికారి నగవత్ స్వామి, సర్పంచు నగునూరి శ్రీనివాస్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ రాంబా బు, బీట్‌ఆఫీసర్ పొశెట్టి, మోహన్, సంతోశ్, యోగేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS