అడవుల సంరక్షణలో భాగస్వామ్యం కావాలి..


Thu,January 12, 2017 01:58 AM

బెజ్జూర్ : అడవుల సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సలుగుపల్లి సెక్షన్ అధికారి వేణుగోపాల్ సూచించారు. బుధవారం ఆయన మండలంలోని సలుగుపల్లి గ్రామంలో అటవీ, వణ్యప్రాణుల సంరక్షణపై ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అంతరించపోతున్న అడవులను రక్షాంచుకోకుంటే మానవ జాతికి మనగడే లేదన్నారు. వన్య ప్రణుల కోసం పెట్టిన ఉచ్చులకు మనుషుల ప్రాణాలు పోతున్నాయని గుర్తు చేశారు. ఇప్పటికైనా గ్రామీణ ప్రాంతాల ప్రజలు మారాలని సూచించారు. వణ్య ప్రాణులతో గ్రామీణ ప్రజలకు, రైతులకు ఎలాంటి నష్టం వాటిళ్లినా దానికి అటవీ శాఖ పరంగా నష్ట పరిహారం చెల్లించేందకు అధికారులు కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ సురేశ్ గౌడ్, ఎఫ్‌బీవోలు రవికుమార్, వందన, గ్రామస్తులు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS