స్త్రీ శక్తి భవనంలోనే ఈజీఎస్ కార్యాలయం

Thu,January 12, 2017 01:58 AM

-డీఆర్డీఏ పీడీ శంకర్
సిర్పూర్(యు): మండల కేంద్రంలో గల స్త్రీ శక్తి భవనంలోనే ఈజీఎస్ కార్యాలయం నిర్వహించాలని డీఆర్డీఏ పీడీ శంకర్ అన్నారు. బుధవారం నూతనంగా నిర్మించిన భవనాన్ని పరిశీలించారు. ఈ భవనాన్ని ఐదేళ్లు క్రితమే సుమారు ఇరవై ఐదు లక్షల నిధులతో నిర్మించినట్లు తెలిపారు. అయినప్పటికీ నేటి వరకూ ఎందుకు ప్రారం భించలేదని సిబ్బందిని ప్రశ్నించారు. ప్రారంభించకుండానే గదులను అద్దెకు ఇస్తున్న ఏపీఎంపై అగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే గదులన్నీ శుభ్రపరచాలని ఆదేశించారు. మరో పదిహేను రోజుల్లో ఈ భవనాన్ని ప్రారంభించి ఈజీఎస్ కర్యాలయాన్ని ఇం దులోకి మార్చనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శశికళా, ఏపీఎం రామరావ్, జూనియర్ అసిస్టెంట్ వినోద్ ఉన్నారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...