నాణ్యతతో కూడినవైరింగ్ చేయాలి


Thu,January 12, 2017 01:58 AM

-టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు సదాశివ్
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాలోని గోలేటిటౌన్‌షిప్, మదారంటౌన్‌షిప్‌లో గల కార్మికుల క్వార్టర్స్ లో చేస్తున్న వైరింగ్ నాణ్యతతో కుడిన సేప్టీ వైరింగ్ చేయాలని బెల్లంపల్లి ఏరియా టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు నల్లగొండ సదాశివ్ కొరారు. గోలేటిలో ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికుల కంపెనీ క్వార్టర్స్‌లో చేస్తున్న ఎలక్ట్రికల్ వైరింగ్ సక్రమంగా లేదన్నారు. వైరింగ్ కర్ర గిట్టెలు గ్రౌటింగ్ చేయకుండా గోడలపై మేకులు కొట్టి వైరింగ్ చేయడం వలన కొద్ది రోజులకే ఉడిపొయి షాట్ సర్కూట్ జరిగే ప్రమాదం ఉందన్నారు. నాణ్యత లేని స్వి చ్‌లు. వైర్‌ను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ప్రతి క్వార్టర్‌కు ఎర్త్ పాయింట్ ఉండాలనీ కాని చాలా క్వార్టర్‌లకు ఎర్త్ పాయింట్ లేక పొవడంతో ప్రమాదలు జరిగే అవకాశం ఉందన్నారు. సంబంధిత ఆధికారుల దీనిపై దృష్టి పెట్టాలని కోరారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS