ఊరికి వెళ్లేవారు సమాచారం ఇవ్వాలి


Thu,January 12, 2017 01:57 AM

ఆసిఫాబాద్ రూరల్: సంక్రాంతి సెలవుల్లో వి విధ ఊర్లకు వెళ్లే వారు స్థానికులకు, పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ నరేశ్ సూచించారు. బుధవారం రాత్రి అంబేద్కర్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పండుగను పు రస్కరించుకొని వివిధ గ్రామాలకు వెళ్లేవారు విలువైన వస్తువులను తమ వెంట తీసుకుని వె ళ్లాలని సూచించారు. తాళం వేసిన ఇండ్లలో చోరీ లు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని అం దుకే ఊరికి వెళ్లేవారు ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇస్తే ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహించి చోరీలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఎస్‌ఐ సూచించారు. కార్యక్రమంలో పట్టణ ప్రజ లు, తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS