దళితులపై దాడులను అరికట్టాలి


Thu,January 12, 2017 01:56 AM

-సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్
-పట్టణానికి బస్సు యాత్ర
కాగజ్‌నగర్ నమస్తే తెలంగాణ : దేశంలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ మాజీ శాసనసభాపక్షనేత గుండా మల్లేశ్ ఆరోపించారు. పట్టణంలో బుధవారం బస్సు యాత్ర కొనసాగగా అంబేద్కర్ చౌరస్తాలో మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాలు నేటికి అమలు కాకపోవడానికి అగ్రవర్ణ రాజకీయ శక్తులే అడ్డంకిగా నిలుస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా ఈనెల 22న హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద ఉదయం 11 గంటలకు దళి త హక్కుల పోరాట సమితి వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ గిరిజన సమైఖ్య ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు.

దీనిని విజయవంతం చేసేందుకు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. రాష్త్ర ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహు, డీహెచ్‌పీఎస్ రాష్త్ర కార్యదర్శి బరిగెల సాయిలు, టీజీఎస్ రాష్త్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య నాయక్ , డీఎస్‌పీఎస్ రాష్త్ర ఉపాధ్యక్షుడు గెలువ య్య, అంబేద్కర్ మోమోరియల్ అసోసియేషన్ తాలూకా అధ్యక్షుడు రాంటెంకి శ్రీహరి, నాయకులు అంబాల ఓదెలు,భాష్, చరణ్‌దాస్, లక్ష్మణ్ పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS