పేదల అభ్యున్నతే సర్కారు ధ్యేయం


Wed,January 11, 2017 03:11 AM

-దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు
-అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం
-ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
-209 మందికి షాదీముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కుల అందజేత

కాగజ్‌నగర్, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలో నిరుపేదల అభ్యున్నతే రాష్ట్ర సర్కారు ధ్యేయమని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. పట్టణంలోని మైనార్టీ ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం 209 మందికి ఆర్డీవో పాండురంగతో కలిసి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీలో పాల్గొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 427 మంది ల బ్ధిదారులకు రూ. 1 కోటి 6లక్షల 59 వేలను అం దజేశారు. పేదింటి అడపడుచుకు కల్యాణ సమయంలో అండగా ఉండేందుకు ప్రభుత్వం ఈ పథకాల ద్వారా రూ. 51 వేలను ఆర్ధిక సాయంగా అందజేస్తున్నదన్నారు. కాగజ్‌నగర్‌లో 427 మం ది దరఖాస్తు చేసుకోగా, వారందరికీ మంజూరయ్యాయని పేర్కొన్నారు.

గతవారం 200 మంది కి అందజేయగా, ఇప్పుడు 209 మందికి ఈ చె క్కులు అందజేసినట్లు తెలిపారు. మిగితా వారికి త్వరలోనే అందజేయనున్నట్లు చెప్పారు. అన్ని వ ర్గాల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముం దుకు సాగుతున్నారని కొనియాడారు. దేశంలో ఎ క్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చే స్తున్న ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. అనంతరం ఇన్‌చార్జి ఆర్డీవో పాండురంగ మాట్లాడుతూ 209 మంది లబ్ధిదారుల్లో 184 మంది బీసీలు, 11 మంది ఎస్సీలు, 12 మంది ఎస్టీలు, మరో ఇద్దరు మైనార్టీలు ఉన్నట్లు తెలిపా రు.

మండలాల వారీగా బెజ్జూర్‌లో 25 మంది, చింతలమానెపల్లిలో 22 , దహెగాంలో 20, కాగజ్‌నగర్‌లో 83, కౌటాలలో 23 , పెంచికలపేటలో 8, సిర్పూర్‌లో 28 మంది ఉన్నట్లు చెప్పారు. చె క్కుల పంపిణీకి హాజరైన లబ్ధిదారులు, వారి కు టుంబసభ్యులకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప భోజన వసతి కల్పించారు. కాగజ్‌నగర్ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు పద్మ సత్యనారాయణ, ఆత్మ చైర్మన్ కొమురగౌడ్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు సం తోష్‌గౌడ్, సిర్పూర్ ఎంపీపీ నీరటిరేఖ, తహసీల్దార్లు సురేష్, యాకన్న, పరిమల్ భౌమిక్, రఫత్, లింగమూర్తి, బికర్ణదాస్ , నాయకులు కోనేరు కృష్ణారావు, కట్టప్రసాద్, సత్యనారాయణ, సదాశివ్, జాకీర్‌షరీఫ్, ఆర్షద్, కౌన్సిలర్లు జానిమియా, రాచకొండ గిరీశ్, ఎస్‌హెచ్‌ఓ నాగేందర్, టౌన్ ఎస్‌ఐ ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS