ప్రజలకు దగ్గరయ్యేందుకే మీ కోసం


Wed,January 11, 2017 03:09 AM

-మెగా వైద్య శిబిరంలో ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్

ఆసిఫాబద్ రూరల్ : ప్రజలకు దగ్గరయ్యేందుకే పోలీసులు మీకోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. ఆసిఫాబాద్ సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో మారుమూల గిరిజన గ్రామం మాలన్‌గోందిలో మంగళవారం ఏ ర్పాటు చేసిన ఉచిత నేత్రవైద్య శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై గిరిజనులనుద్ధేశించి మాట్లాడారు. ఇకపై పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలతో కలిసి ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని హామీనిచ్చా రు. ప్రజలు సైతం పోలీసులను తమలో ఒకరిగా గుర్తించి సంఘవిద్రోహక కార్యక్రమాల పాల్పడే వారి సమాచారం పోలీసులకు ఎప్పటికప్పుడు ఇ వ్వాలని కోరారు. ఇప్పటికే ప్రజలకు చేరువయ్యేందుకు జిల్లాలో గతేడాది పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు నిర్వహించినట్లు గుర్తు చేశారు.

అంతేగాకుండా యువత కోసం కబడ్డీ, వాలీబాల్ , క్రికెట్ పోటీలు నిర్వహించామన్నారు. యువత వ్యసనాలకు బాని స కా కుండా చదువుపై దృష్టి పెట్టి తల్లిదండ్రులకు మం చి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. చదువుతోనే అభివృద్ధి సాధ్యమని గ్రామీణ ప్రాంత ప్రజలు తమ పిల్లలను తప్పని సరిగా చదివించాలని సూచించారు. అనంతరం డీఎస్పీ భాస్కర్ మాట్లాడుతూ నేత్ర వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించి 51 మందికి ఉచితంగా కంటి అద్దాలు, మందులు అందించామని తెలిపారు. అవసరము న్న వారికి స్లైన్ బాటిళ్లు ఎక్కించారు. ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ స్వయంగా శిబిరంలో తిరుగుతూ రోగులను అందుతున్న వైద్యం తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గిరిజనులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

ఎస్పీ సతీమణి డాక్టర్ దీప ఈ శిబిరంలో ఆయనతో పాటు పాల్గొన్నారు. 80 మంది వృద్ధులకు దుప్పట్లు , 20 మంది వితంతువులకు చీరలు, యువతకు స్పోర్ట్స్ డ్రెస్‌లు, చిన్నారులకు పలకలు, స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌హెచ్‌ఓ సతీశ్ కుమార్, పీఏసీఎస్ అధ్యక్షుడు అలీబిన్ అహ్మద్, సర్పంచ్ మడావి తిరుపతి, ట్రేడర్స్ అసోసియేషన్ నాయకులు రఫీక్ జివాని, తాటిపెల్లి అశోక్ , పోలీస్ సిబ్బంది , ఆయా గ్రా మాల ప్రజలు పాల్గొన్నారు. అంతకు ముందు వై ద్య శిబిరంలో పాల్గొనేందుకు వచ్చిన ఎస్పీ దంపతులకు గిరిజనులు గుస్సాడీలతో ఘన స్వాగతం పలికారు.

సంక్రాంతి సంబరం


కౌటాల మండలంలోని విజయనగరం సెయింట్ జోసెఫ్స్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. కొందరు విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో రాగా, మరికొందరు హరిదాసులు, గంగిరెద్దులోళ్ల వేషధారణలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు సకినాలను స్వయంగా చేశారు. కొందరు బసవన్నలతో సందడి చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన సీఐ అచ్చేశ్వర్‌రావు మాట్లాడుతూ క్రైస్తవ పాఠశాలలో హిందు పండుగలను నిర్వహించడం అభినందనీయమన్నారు.

అనంతరం సీఐ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు, మేనేజర్, ఎంపీటీసీలు విద్యార్థులకు క్రికెట్ కిట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు కౌటాల బ్రాంచ్ మేనేజర్ సుశాంత్ కుమార్, కౌటాల, బెజ్జూర్ ఎస్‌ఐలు అశోక్, రాజు, ఎంపీటీసీ తాళ్లపెల్లి శ్రీనివాస్ గౌడ్, కరస్పాండెంట్ ఫాదర్ వినోద్, ప్రధానోపాధ్యాయులు మాదాను లూర్దు మారయ్య, విజయనగరం, యాపలగూడ చర్చి ఫాస్టర్లు ప్రసాద్, టిజో, మఠకన్యలు సిస్టర్ బ్రెట్టి, విద్యార్థుల తల్లితండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS