జిల్లాకు నేడు హరీశ్‌రావు


Wed,January 11, 2017 03:08 AM

-రూ. 6.55 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
-మిషన్ భగీరథ పనులు పరిశీలించే అవకాశం
-వాంకిడిలో మినీ దాల్‌మిల్ప్రారంభం
-మార్లవాయిలో డార్ఫ్ వర్ధంతిసభలో ప్రసంగం
-హాజరుకానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. రూ. 6.55 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు వాంకిడిలోని మినీ దాల్‌మిల్‌ను ప్రారంభించనున్నారు. జైనూర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరై, అక్కడి నుంచి మార్లవాయిలో నిర్వహించే హైమన్‌డార్ఫ్ వర్ధంతి సభలో ప్రసంగించనున్నారు.

భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు బు ధవారం జిల్లాలో పర్యటించనున్నారు. రూ. 6. 55 కోట్లతో జిల్లాలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఉద యం 8 గంటలకు ఆసిఫాబాద్ మండలం ఆడ గ్రామంలో భీం ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్ నుంచి ప్రాజె క్టు దాకా రూ. 4 కోట్ల 23 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 9 గంటలకు వాంకిడి మండలంలో వనబంధు కల్యాణయోజన ద్వారా రూ. 8 లక్షల 50 వేలతో ఇందిరా క్రాంతిపథం ఆధ్వర్యంలో నిర్మించిన మినీ దాల్‌మిల్‌ను ఉదయం 11 గంటలకు ప్రా రంభిస్తారు. అనంతరం జైనూర్ మార్కెట్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత రూ. 2 కోట్ల 32 లక్షలతో రాగాపూర్ వద్ద చేపట్టనున్న మినీ ట్యాంక్ బండ్ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మర్లవాయిలో నిర్వహించనున్న హైమన్‌డార్ఫ్ 30వ వర్ధంతి సభలో పాల్గొంటారు. కుమ్రం భీం ప్రా జెక్టు నుంచి చేపడుతున్న మిషన్ భగీరథ, ప్రాజెక్టు కెనాల్ పనులను పరిశీలించే అవకాశముంది.

హాజరు కానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు


డార్ఫ్ వర్ధంతి సభకు మంత్రి హరీశ్‌రావుతో పా టు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. జైనూర్, సిర్పుర్(యు) మండలాల సరిహద్దులోనున్న మార్లవాయి చెరువును మినీట్యాంక్‌బాండ్ కింద ఎంపిక చేశారు. దానికీకి హైమన్‌డార్ఫ్ మినీ ట్యాంక్ బండ్‌గా నామకరణం చేయనుండగా డార్ఫ్ దంపతులకు అరుదైన గౌరవం లభించనున్నది. కాగా, మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జైనూర్ మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో కొనసాగుతున్న పనులను ఉదయం నుంచి సీఐ ప్రసాద్‌రా వు, ఎస్‌ఐ రాజు ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తున్నా రు. జిల్లా మార్కెటింగ్ అధికారి వెంకటేశ్వర్లు, డీపీఎం నారేందర్, డిప్యూటీ తహసీల్దార్ రాథోడ్‌బాబు సింగ్, పనులను సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు ముం దస్తుగా భారీ బందోబస్తులు ఏర్పాటు చేశారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS