హైమన్‌డార్ఫ్ స్మృతిలో..


Wed,January 11, 2017 03:07 AM

-ఆదివాసుల గుండెలో నిలిచిన పుణ్యదంపతులు
-నేడు 30వ వర్ధంతి

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ జైనూర్: అడవుల మధ్య.. అభివృద్ధికి దూరంగా ఉంటున్న ఆదివాసీ జీవితాల్లో వెలుగులు నింపారు హైమన్‌డార్ఫ్ దంపతులు. నేడు ఆదివాసీలు కొంత అభివృద్ది దిశగా పయనిస్తున్నారంటే అది వారు చేసిన అధ్యయనం కృషే. అందుకే నేటికీ ఈ దంపతులు ఆదివాసీల గుండెల్లో కొలువై ఉన్నారు. నేడు హైమన్‌డార్ఫ్ దంపతుల 30వ వర్ధంతి సందర్భంగా గిరిజనులు వారిని స్మరించుకుంటున్నారు. దేశంలోని ఆదివాసీ గిరిజనులను బాహ్య ప్రపంచానికి పరిచయం చేశారు ప్రపంచ మానవ పరిణామ శాస్త్రవేత్తగా హైమన్‌డార్ఫ్. గిరిజనుల జీవన శైలిపై పరిశోధన చేసి వారికి మేలు చేశారు. వారి 30వ వర్ధంతి సందర్భంగా నమస్తే తెలంగాణ ప్రత్యేక

కథనమిదీ....అధ్యయానికి వచ్చి...


1936 నుంచి మనదేశంలోని పలు రాష్ర్టాల్లో గిరిజనుల స్థితిగతులను అధ్యయనం చేశారు. 1939-40 లో మన రాష్ట్రంలో అడుగుపెట్టారు. భద్రాచలం, విశాఖపట్టణం జిల్లాల్లోని చెంచు, నాగ ఆదివాసుల జీవనంపై అధ్యయనం ప్రారంభించారు. అది జల్ జంగల్ జమీన్ కోసం కుమ్రం భీం పోరాడుతున్న సమయం. రజాకార్లతో పోరాడుతూ విప్లవ యోధుడు భీం మృతి చెందాడు. భీమ్ మరణానంతరం అప్పటి నిజాం ప్రభుత్వం భీమ్, ఆదివాసుల తీరుగుబాటుకు గల కారణాలు తెలుసుకుని నివేదికలు అందించాలని హైమన్‌డార్ఫ్‌ను పంపించింది.

1941 నుంచి వారు గోండు గిరిజనుల నివాసాల్లో ఉన్నారు. జిల్లాల్లోని పలు ప్రాం తాల్లో పర్యటన చేసి జైనూర్ మండలంలోని మార్లవాయిలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. దట్టమైన అడవిలో దయనియ పరిస్థితుల్లో ఉన్న ఆదివాసీ గిరిజనులకు మేలు చేయాలన్నా సంకల్పంతో వారి పరిశోధన కొనసాగించారు. భీమ్, ఆదివాసుల తిరుగుబాటుకు గల కారణాలు తెలియజేసి నైజాం ప్రభుత్వానికి నివేదికలు అందించారు. గిరిజన పోరాటయోధుడు భీమ్ ఉద్యమ సాధన మేరకు రెండు లక్షల ఎకరాల భూమి ఆదివాసులకు అందించాలని కోరగా, పోడు వ్యవసాయ భూమిని నిజాం ప్రభుత్వం గిరిజనులకు అందించింది.

గిరిజనులతో మమేకం..


గిరిజనులతో హైమన్‌డార్ఫ్ మమేకమయ్యారు. సంస్కృతి సాంప్రదాయలకు మక్కువ చూపారు. వారి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆదివాసులకు విద్య, వైద్యం అందించాలని 1946లో మార్లవాయి, తిర్యాణి మండలంలోని గిన్నెదరి, సిద్దిమెల్ల ప్రాంతాల్లో 30 గిరిజన పాఠశాలలను ఏర్పాటు చేశారు. స్వాతం త్య్రం వచ్చిన తర్వాత రాజ్యంగబద్దంగా సంక్షేమ పథకాలు అందించడానికి శ్రీకారం చుట్టారు. ప్రత్యేక గిరిజన అభివృద్ది వ్యవస్థ ద్వారా సేవలందాలని ప్రణాళిక సిద్దం చేశారు. ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. గిరిజన సంక్షేమ శాఖ ఏర్పడిన తర్వాత ఆయన ఇతర ప్రాంతాలకు వెళ్లి ఎన్నో సంక్షేమ పథకాలకు శంకుస్థాపన చేశారు.

గిరిజన అభివృద్దిపై జాతీయ గిరిజన సభలో నివేదిక అందించేందుకు వివరాలు సేకరిస్తూనే డార్ఫ్ సతీమణి 1987లో హైదరాబాద్‌లో హఠాన్మరణం పొందారు. ఆమె దినచర్య పుస్తకంలో రాసిన ప్రకారం మార్లవాయిలో గిరిజన సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహంచారు. వారి కుమారుడు నికోలస్‌కు అప్పటి గ్రామపటేల్ లచ్చు పటేల్‌గా నామకరణం చేశారు. అనంతరం స్వదేశం ఆస్ట్రేలియాకు వెళ్లిన డార్ఫ్ 1995లో వృద్ధాప్యంతో మృతి చెందారు. అప్పటినుంచి ఏటా జనవరి 11న ఆదివాసులు పుణ్య దంపతులిద్దరి వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. 2010లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మార్లవాయి గ్రామాన్ని సందర్శించి, డార్ఫ్ దంపతులకు నివాళులర్పించారు. 2012లో తండ్రి కోరిక తీర్చేందుకు కోడుకు లచ్చుపటేల్( నికోలస్) డార్ఫ్ ఆస్థికలను తరలించి బెట్టి ఎలిజబెత్ సమాధి పక్కన నిర్మించి ఉన్న డార్ఫ్ సమాధిలో పూడ్చివేశారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS