ప్రజా సంక్షేమమే ధ్యేయం


Wed,January 11, 2017 03:06 AM

ఆసిఫాబాద్ నమస్తే తెలంగాణ : సంక్షేమమే ధ్యే యంగా ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. మంగళవారం తన నివాసంలో ఏ ర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గం రెండున్నరేళ్లలో దాదాపుగా రూ 3 కోట్ల పనులు చెపట్టినట్లు తెలిపారు. బుధవారం మంత్రి హరీశ్ రావు నియోజవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఆడ ప్రాజెక్టు సందర్శన అనంతరం ఇందాని పీడబ్ల్యూ రోడ్డు నుంచి ప్రాజెక్టు వరకూ 3 కిలో మీటర్లకు రూ 4 కోట్లతో నిర్మించనున్న రోడ్డుకు భూమి పూజ, వాంకిడి మండల కేంద్రంలో దాల్‌మిల్ ప్రారంభం, జైనూర్ మండలంలోని గోదాంలను ప్రారంభంచిన అనంతరం మార్కెట్ పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం హైమన్ డార్ఫ్ పేరున ఘగావపూర్ చెరువును మినీ ట్యాంక్ బాండ్ నిర్మించనున్న చెరువుకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. మార్లవాయిలో నిర్వహించే హైమన్ డా ర్ఫ్ వర్ధంతి సభలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ గంధం శ్రీనివాస్,కుందరావు శంకరమ్మ, ఆత్మ చైర్మన్ రమేశ్ ఉన్నారు.

ఉపాధ్యాయులు విద్యప్రమాణలు పెంచాలి..


ఉపాధ్యాయులు విద్యప్రమాణాలు పెంచాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి సూచించారు. మంగళవారం ఎమ్మెల్యే నివాసం వద్ద తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్‌ను ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ విద్య బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కృషి చేయాలన్నారు. పేద విద్యార్థులకు విద్యను అందించి వారి భవిష్యత్‌కు బాట లు వేయాలన్నారు. మారుమూల గ్రామల్లో చదువుపై ప్రజలకు అవగాహన కల్పించి బడీడు పిల్లలను బడిలో చేర్పించాలన్నారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్‌కే ప్రసాద్ మాట్లాడుతూ సీపీఎస్ విధానం రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. మార్కెట్ కమి టీ చైర్మన్, వైస్ చైర్మన్ గంధం శ్రీనివాస్, కే శంకరమ్మ, ఆ సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభోక్‌కుమార్, ఉపాధ్యక్షుడు గోమంత్ రెడ్డి ఉపాధ్యాయులున్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS