మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

Wed,January 11, 2017 03:06 AM

-కలెక్టర్ చంపాలాల్
-ముగ్గుల పరిశీలన
-విజేతలకు బహుమతుల ప్రదానం

కాగజ్‌నగర్ నమస్తే తెలంగాణ : మహిళులు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ చంపాలాల్ పిలుపునిచ్చారు. సంక్రాంతిని పురస్కరించుకొని పట్టణంలోని గాంధీ చౌక్‌లో కాగజ్‌నగర్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ముగ్గుల పోటీలను తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో మీడియా పాత్ర ఎంతో కీలకమైందని, వారు ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు.

ఈ సందర్బంగా 50 మంది మహిళలు వివిధ ఆకృతుల్లో తె లంగాణ సంస్కృతిని ప్రతిభింబించేలా వేసి ముగ్గులు ప్రాధాన ఆకర్షణగా నిలిచా యి. విజేతలకు ప్రథమ, ద్వితీయ బహుమతులను అందజేశారు. పాల్గొన్న వారికి ప్రోత్సాహక బహుమతులను పంపిణీ చేశా రు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షురాలు విద్యావతి, కౌన్సిలర్లు బొద్దున విద్యావతి, వైద్య సురేఖ, రాచకొండ గిరీశ్, మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు నర్సింగోజు పద్మ ,ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ సభ్యులు దాసరి లక్ష్మణ్, అవినాష్, రాజశేఖర్, సుధీర్, కిర ణ్, బర్ల కిరణ్, రమణ, ముఫకమ్, పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...