ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేయబోయి..

Wed,January 11, 2017 03:06 AM

-ఆర్టీసీ బస్‌ను ఢీకొన్న లారీ
-పది నెలల బాలుడి మృతి
-30 మందికి గాయాలు
-మంచిర్యాలకు తరలింపు
-పరామర్శించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ఆసిఫాబాద్ క్రైం : ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టడంతో పదేండ్ల బాలుడు మృతి చెందగా, 30 మంది గాయపడిన ఘటన ఆసిఫాబాద్ మండలం బూర్గుడ సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగింది. కాగజ్‌నగర్ వైపు నుంచి ఆసిఫాబాద్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సును నాగపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేయబోయి బస్సును ఢీకొట్టగా, సిర్పూర్ (టి)కి చెందిన ఆజాం రహెమాన్, జుబేదా బేగంల కుమారుడు నవాజ్ (10 నెలలు) మృతి చెందాడు. 30 మంది గాయపడ్డారు. వీరిని 108లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు.

తీవ్రంగా గాయపడ్డ మరో 10 మందిని మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి హుటాహుటిన దవాఖానకు చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో సుబ్బరాయుడిని ఆదేశించారు. డీఎస్పీ భాస్కర్ ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం తీరును అడిగి తెలుసుకున్నారు. రోగులకు పరామర్శించిన వారిలో మార్కెట్ కమిటీ చైర్మన్ గంధం శ్రీనివాస్,సింగల్ విండో చైర్మన్ అలీబిన్ ఆహ్మద్, సర్పంచ్ మర్సుకోల సరస్వతి, నాయకులు మహెమూద్, అన్సార్ ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సతీశ్‌కుమార్ తెలిపారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...