గ్రామాల్లో పశువైద్య శిబిరాలు


Wed,January 11, 2017 03:05 AM

దహెగాం: మండలంలోని బీబ్రా గ్రామంలో మంగళవారం పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ సం దర్భంగా పశువైద్యాధికారి శ్రావన్‌కుమార్ మాట్లాడుతూ 319 పశువులకు గాలికంటు వ్యాధినివారణ టీకాలను వేసినట్లు పేర్కొన్నారు. అనంతరం సర్పంచ్ డీ స్వప్న మాట్లాడుతూ ప్రభుత్వం పశువుల అభివృద్ధికి చేయూతను అందిస్తుందని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమం లో పశువైద్య సిబ్బంది మల్లేశ్, నరేశ్, హన్మయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

పెంచికలపేట : మండలంలోని కొండపల్లి గ్రామం లో మంగళవారం పశువైద్య శిబిరం ఏర్పాటు చేశారు. జూనియర్ వైద్యుడు శ్రీనివాస్ మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు పశువులకు వేయిస్తే వ్యాధులు దరిచేరవన్నారు. 200పశువులకు టీకాలు వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎల్కరి సుధాకర్, పశువైద్య సిబ్బంది కొట్టె శివ, శ్రీను, రైతులు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS