గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలి


Mon,January 9, 2017 10:57 PM

-అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలి
-సంక్షేమ పథకాలపై శకటాలు ప్రదర్శించాలి
-17లోగా ఉత్తమ ఉద్యోగుల జాబితా ఇవ్వాలి
-అధికారుల సమీక్షలో కలెక్టర్ చంపాలాల్

ఆసిఫాబాద్,నమస్తే తెలంగాణ : జిల్లాలో గణతంత్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారుల ను కలెక్టర్ చంపాలాల్ ఆదేశించారు. తన కార్యాల య సమావేశం మందిరంలో సోమవారం పలు శా ఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరేడ్ గ్రౌండ్‌లో పలు శాఖాలకు కేటాయించిన పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.

ఎగ్జిబిషన్ , వ్యవసాయశాఖ విత్తనాలు నూతన వరి వంగడాలు విభాగానికి సంబంధించిన ఏర్పాట్లు ఆ యా శాఖల అధికారులు చూడాలన్నారు. మ హిళా శిశు సంక్షేమం, ఉద్యానవన, పశు సంవర్ధక, ఎస్సీ, బీసీ, మైనార్టీ, జిల్లా గిరిజన సంక్షే మ, విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి సంస్థ, మత్స్యశాఖలు ప్రభుత్వ ఆర్థిక చేయుత పథకాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు ఉండేలా శకటాలను ప్రదర్శించాలని సూచించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో సాముహికంగా దేశభక్తి చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అందులో పాల్గొన్న వారికి బహుమతులు అందించాలన్నారు. స్టేజీ ఏర్పాటు బాధ్యత ఇన్‌చార్జి ఆర్డీవో మోహన్‌రావు చూడాలని ఆదేశించారు.

ఉత్తమ ప్రతిభ చూపిన ఉద్యోగుల్లో ఇద్దరిని ఎంపిక చేసి ఈ నెల 17లోగా డీఆర్వోకు తెలిపాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశించా రు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉదయం 8.15 నిమిషాలకు జాతీయ జెండా ఆవిష్కరించాలన్నారు. పరేడ్ గ్రౌండ్‌లో 8. 45 నిమిషాలకు వేడుకలు ప్రారంభం కావాలన్నా రు. సాయంత్రం 4 గంటలకు కలెక్టర్ క్యాంపు కా ర్యాలయంలో ఎట్‌హోం కార్యక్రమం ఉంటుందన్నారు. సమావేశంలో జేసీ అశోక్ కుమార్, డీఆర్‌డీఏ శంకర్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS