భక్తజన సంద్రం


Mon,January 9, 2017 10:57 PM

-పోతరాజు ఆలయానికి తరలివచ్చిన భక్తులు
-ఆరాధ్య దైవాలకు ప్రత్యేక పూజలు
-ఆటల పోటీలు
-సహపంక్తి భోజనాలు
-ఆకట్టుకున్నమహిళల నృత్యాలు

కెరమెరి: మండలంలోని సావర్‌ఖేడ గ్రామ సమీపం పెద్ద వాగు తీరంలోని పోతరాజు, ధర్మరాజు ఆలయం సోమవారం భక్తజన సంద్రంగా మారింది. యేటా జనవరిలో కొలాం తెగకు చెందిన ఆదివాసులు సంప్రదాయ పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ నేపథ్యం లో ఆలయంలోని పోతరాజు, ధర్మరాజుతో పాటు అవ్వల్‌పేన్, మైసమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేవేద్యాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా సంప్రదాయ వా యిద్యాల మధ్య మహిళల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆలయ కమిటీ అధ్యక్షుడు సిడాం రాజు, పూజారులు, నిర్వాహకులు సిడాం గుంగు, సిడాం ధర్ము, చినభీము, పాండురంగ్, రాజు, రాము ఆధ్వర్యంలో ప్ర సాదం, సహపంక్తి భోజనం ఏర్పాటు చేశా రు. ఆదివాసీ నాయకులు కుర్సెంగా ధర్మరా వ్, రఘునాథ్, మోహన్, కట్టి పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS