క్రీడలతో మానసికోల్లాసం

Mon,January 9, 2017 10:57 PM

-డీఎస్పీ హబీబ్ ఖాన్
-క్రికెట్ టోర్నీ ముగింపునకు హాజరు
-తల్లిదండ్రులు ప్రోత్సహించాలని పిలుపు

కాగజ్‌నగర్, నమస్తే తెలంగాణ: క్రీడలతో మా నసికోల్లాసం కలుగుతుందని కాగజ్‌నగర్ డీఎస్పీ హబీబ్ ఖాన్ అన్నారు. చింతగూడ కోయవాగు లో ఎస్‌ఐ శ్రీధర్ స్మారకార్థం క్రికెట్ పోటీల ము గింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తల్లిదండ్రులు పిల్లలను క్రీడలకు ప్రోత్సహించాలన్నారు. ఎస్‌ఐ శ్రీధర్ ఈ ప్రాంతానికి చేస్తున్న సేవలను కొనియాడారు. స్మారక క్రీడ ల్లో గెలుపొందిన కాగజ్‌నగర్ తాజ్‌నగర్ జట్టు, ర న్నర్‌గా కోయవాగు జట్టు రాణించగా, గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందజేశా రు. సీఐ రమేశ్ బాబు, ఎస్‌ఐలు రాజేశ్, ప్రవీణ్ తో పాటు నిర్వాహకులు ఖలీం, సంపత్, రాజేశ్, రాజన్న, తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...