పోలింగ్ సజావుగా నిర్వహించాలి

Mon,January 21, 2019 12:20 AM

నెన్నెల: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సో మవారం నిర్వహించే పోలింగ్ సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని కలెక్టర్ భారతి హోళికేరి సూచించారు. మండల కేంద్రంలో ఎన్నికల డిస్ట్రిబూషన్ కేంద్రాన్ని ఆదివారం పరిశీలించారు. అధికారులు, పోలింగ్ సిబ్బందితో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణ లో ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఓటు వేసేలా చూడాలన్నారు. ప్రతి ఓటరును తప్పకుండా తగిన ఐడీ కార్డు చూసి ఏజంట్‌కు చెప్పి బ్యాలెట్ పేపర్ అందించాలని సూచించారు. ఓటర్లను మభ్యపెట్టడం లాంటివి చేయకుండా పోటీసులు చూడాలన్నారు. లె క్కింపులో ఎలాంటి తేడాలు లేకుండా ప్రతి బ్యాలెట్‌ను క్షుణ్ణంగా చూసి ఇరువర్గాల వారికి చూపించి లెక్కించాలని లేదంటే అభ్యర్థులు గొడవలకు దిగే ఆస్కారం ఉంటుందన్నారు. అనంతరం బ్యాలెట్ బాక్సులు, సా మగ్రి తరలింపును పరిశీలించారు. ఆమె వెంట బెల్లంపల్లి సబ్‌కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎంపీడీవో వరలక్ష్మి, తహసీల్దార్ ప్రకాశ్ ఉన్నారు.

వేమనపల్లి: దస్నాపూర్ ఆశ్రమ పాఠశాలలో పంచాయతీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ డిస్ట్రిబ్యూట్ కేంద్రాన్ని కలెక్టర్ భారతి హోళికేరి పరిశీలించారు. ఎన్నికల సిబ్బంది డిస్ట్రిబ్యూట్ కేంద్రం నుంచి సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తీసుకువెళ్లారా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 12 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నందున ఓటర్లకు ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఎన్నికల అధికారులకు ఆదేశించారు. కేంద్రాల్లో విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. విధుల్లో అధికారులు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎంపీడీవో రమేశ్ చంద్ర కులకర్ణి, తహసీల్దార్ నరేందర్, డిప్యూటీ తహసీల్దార్ శ్రావణి, తదితరులున్నారు.

ఏసీపీ పరిశీలన
పోలింగ్ డిస్ట్రిబ్యూట్ కేంద్రాన్ని జైపూర్ ఏసీపీ వెంకట్‌రెడ్డి పరిశీలించారు. నేడు జరిగే ఎన్నికల కోసం భారీ బందోబస్తు నిర్వహిస్తున్నామని తెలిపారు. మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇప్పటికే పలు సమస్యాత్మక గ్రామాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించామనీ, ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పా ట్లు చేశామన్నారు. ప్రజలందరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఆయ న వెంట కోటపల్లి సీఐ జగదీశ్, నీల్వాయి ఎస్‌ఐ భూమేశ్, తదితరులున్నారు.

89
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles