పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయించాలి

Sat,January 19, 2019 12:09 AM

రెబ్బెన: పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయించాలని పశు సంవర్థక శాఖ జిల్లా అధికారి డాక్టర్ శంకర్ రాథోడ్ పాడి రైతులకు సూచించారు. మండలం లో ని ఎడవెల్లి గ్రామంలో శుక్రవారం పశువైద్య శిబిరం నిర్వహించారు. వైద్య సిబ్బంది ఆవులు, బర్రెలకు గాలికుంటు నివారణ టీకాలు వేశారు. ఈ కార్యక్రమానికి హజరైన ఎం పీపీ కార్నాథం సంజీవ్‌కుమార్‌తో కలిసి పశు సంవర్థక శాఖ జిల్లా అధికారి మాట్లాడారు. వేసవిలో పశువుల మేత కోసం ఇబ్బంది పడకుండా గడ్డిజొన్న విత్తనాలు అందుబాటులో ఉన్నయని పేర్కొన్నారు. రాయితీ కోడిపిల్లలు కావాల్సిన వారు మండల పశువైద్యాధికారిని సంప్రదించాలని కోరారు. జిల్లాలో 20వ అఖిల భారత పశుగణన జరుగుతుందని రైతులు తమ పశువుల వివరాలు విషయ సేకరణ అధికారికి అందించాలని సూచించారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి సాగర్, సిబ్బంది పాల్గొన్నారు.

.

88
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles