వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

Sat,January 19, 2019 12:08 AM

జైనూర్ : గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుం డా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్ నాయక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సర్కారు దవాఖానలో వైద్యసిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ముందుగా రికార్డులు పరిశీలించారు. ఆసుపత్రిలో నమోదవుతున్న కేసు ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రసూతి కేసులపై ఆరా తీశారు. మందుల కొరత ఉందా..? అని అడిగి తెలుసుకున్నారు. ప్రతి బాలింతకు త ప్పనిసరిగా కేసీఆర్ కిట్ అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి ధరంసింగ్, వైద్యాధికారి నాగేంద్ర, నావిద్, నరేశ్, హెచ్‌ఎస్ లక్ష్మీకుమారి, కిశోర్, ఏఎన్‌ఎం సుస్మిత, సేవంత, వైద్యసిబ్బంది ఉన్నారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles