ముగిసిన ఎన్‌ఎస్‌ఎస్ శిబిరం

Sat,January 19, 2019 12:08 AM

రెబ్బెన: మండలంలోని ఇందిరనగర్‌లో రెబ్బెన ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబి రం శుక్రవారం ముగిసిందని ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగాం ఇన్‌చార్జి దుర్గం దేవాజీ తెలిపారు. చివరి రోజు ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు నక్కలగూడ గ్రామంలో అక్షరాస్యతపై ర్యాలీ తీసి అవగాహన కల్పించారు. అనంతరం నక్కలగూడ నుంచి పొలాలకు వెళ్లే దారి వెంట ముళ్లపొదలు, పిచ్చిమొక్కలను తొలగించారు. అనంతరం విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో కాగజ్‌నగర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీధర్‌సుమన్, రెబ్బెన ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జాకీర్ ఉస్మానీ, నక్కలగూడ పాఠశాల హెచ్‌ఎం కల్వల శంకర్, అధ్యాపకులు పూదరి మల్లేశ్, ఉప్పులేటి మల్లేశ్, శ్రీకాంత్, రమేశ్, త్రివేణి, స్వప్న, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles