ప్రజల మెప్పు పొందాలి

Sat,January 19, 2019 12:08 AM

రెబ్బెన : పోలీసులు ప్రజల మెప్పు పొందేలా వి ధులు నిర్వర్తించాలని ఎస్పీ మల్లారెడ్డి సూచించా రు. శుక్రవారం సాయంత్రం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. సిబ్బంది, కేసుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంత రం మాట్లాడుతూ స్టేషన్‌లో నమోదైన కేసులు స త్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీస్‌స్టేషన్ పరిధిలోని జాతీయరహదారిపై తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నయనీ, వాటి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపకుండా ఉండేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తునామన్నారు. పోలీసులు - మీ కోసం కార్యక్రమంలో భాగంగా రోడ్లపై గుంతలు పూడ్చివేయడంతో పాటు రోడ్డు పక్కనున్న ముళ్ల పొదలను తొలగిస్తున్నామన్నారు. అంతేగాకుండా వివిధ అంశాలపై కళాజాత బృందాల ద్వారా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్రామాల్లో ఏమైన సమస్యలు ఉంటే నిర్భయంగా స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆసిఫాబాద్ డీఎస్పీ సత్యనారాయణ, రెబ్బెన సీఐ వీవీ రమణమూర్తి, ఎస్‌ఐ రమేశ్ ఉన్నారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles