కౌటాల : అడవులు, వన్యప్రాణుల రక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సిర్పూర్ రేంజ్ ఎఫ్ఆర్వో పూర్ణ చందర్ కోరారు. శుక్రవారం మండలంలోని కన్నెపల్లిలో గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ వనాల పెంపుతోనే మానవ మనుగడ ముడిపడి ఉందని వాటి సంరక్షణకు పాటుపడాలన్నా రు. పంటల రక్షణ పేరుతో వన్యప్రాణులను చంపవద్దన్నారు. అటవీ సరిహద్దు ప్రాంతంలోని పొలాలకు రక్షణ కవచం ఏర్పాటు చేసుకోవాలని సూ చించారు. వంట చెరుకు పేరుతో అడవిలోని చెట్లను నరకవద్దన్నారు. అడవుల రక్షణకు సహకరించాలని కోరారు. అనంతరం గ్రామ పంచాయతీలోని చెట్టుకు అటవీశాఖ అధికారులు రక్షణగా నిల్చొని మానవహరం నిర్వహించారు. కార్యక్రమంలో డీఆర్వ్వో పాషా, ఎఫ్ఎస్ఓలు డీ ప్రకాశ్, సంతోష్ కుమార్, కర్ణ బానేశ్, మోహన్రావు, కే ప్రతాప్నాయక్, ఎఫ్బీఓలు ఆలం ప్రభాకర్, రవీందర్, జామా తదితరులున్నారు.
కుంటలమానేపల్లిలో..
బెజ్జూర్ : మండలంలోని కుంటలమానేపల్లిలో శుక్రవారం అటవీ అధికారులు కళాజాత బృందం వా రితో అడవులు, వన్యప్రాణులను సంరక్షించాలని కోరుతూ అవగాహన కల్పించారు. వన్య ప్రాణులను వేటాడవద్దనీ, వనాల పెంపుతోనే వాతవారణం సమతుల్యంగా ఉంటుందని ఆట పాటల ద్వారా అవగాహన కల్పించారు. వన్య ప్రాణులను హతమార్చితే చట్టపరమైన చర్యలు ఉంటాయని వివరించారు. కార్యక్రమంలో ఎఫ్బీఓలు వందన, మనోహర్ గ్రామస్తులు పాల్గొన్నారు