అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేయాలి

Sat,January 19, 2019 12:08 AM

సిర్పూర్(యు): మండలంలోని అన్ని పాఠశాలల అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎంఈఓ కుడ్మెత సుధాకర్ ప్రధానోపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలో ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాలలో మౌళిక సదుపాయాలు, విద్యార్థులకు యునిఫాంలు, భవనాల మరమ్మతులు, కొత్త భవనాల అవసరం, నీటి సమస్య, విద్యుత్ లాంటి సమస్యలను గుర్తించాలన్నారు. సిద్ధం చేసిన ప్రణాళికను ఈ నెల 21లోపు తమ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ఈ సమావేశంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సతీశ్, ప్రధానోపాధ్యాయులు ఆత్రం ఆనంద్‌రావ్, కోట్నక పాండురంగ్, కొత్తూరి ఆంధ్రయ్య, జాదవ్ విలాస్, దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles