అసెంబ్లీకి ఎమ్మెల్యేలు

Thu,January 17, 2019 02:12 AM

(కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ ) తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఈ నెల 17న రెండవ సారి కొలువు తీరనున్నది. గత నెలలో నిర్వహించిన ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన 119మంది శాసనసభ్యులు నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్వీకర్‌గా ఎన్నికైన ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌తో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ బుధవారం ప్రమాణస్వీకారం చేయించిన నేపథ్యంలో, గురువారం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవానికి సర్వం సిద్ధమైంది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు నేడు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తరువాత 2014లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా నాలుగేళ్ల మూడు నెలల పాటు రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి దేశంలోనే నంబర్ వన్ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ప్రభుత్వం చేస్తున్న పనులను అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిది నెలల ముందుగానే రాష్ట్ర శాసనసభను రద్దు చేసి ఎన్నికల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే.. 2018 సెప్టెంబర్ 6వ తేదీన రాష్ట్ర శాసనసభ రద్దు కావడంతో 2018 డిసెంబర్ 7వ తేదీన రాష్ట్ర శాసన సభకు ఎన్నికలు నిర్వహించారు. డిసెంబర్ 11వ తేదీన ఫలితాలు ప్రకటించడంతో టీఆర్‌ఎస్ పార్టీ మరో మారు ప్రభంజనం సృష్టించింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు మెజార్టీ సీట్లు సాధించిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు. అదే రోజున రాష్ట్ర హోం మంత్రిగా మహముద్‌అలీ ప్రమాణస్వీకారం చేశారు.

జిల్లా నుంచి ఇద్దరు..
జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మూడోసారి గెలిచి, అసెంబ్లీలో అడుగుపెడుతుండగా, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కూడా గతంలోనూ శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయినా, 2019లో విజయం సాధించారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles