మేము సైతం..

Thu,January 17, 2019 02:11 AM

వాంకిడి: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు సమాజ సేవకు నడుం బిగించారు. సామాజిక అంశాలపై గ్రామీణులకు అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చారు. బుధవారం మండలంలోని లంజన్‌వీర గ్రామంలో శీతాకాల శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరంలో భాగంగా వారంపాటు రోజుకో కార్యక్రమం చేపట్టి గ్రామస్తులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించనున్నారు. మొదటిరోజు స్వచ్ఛభారత్‌లో భాగంగా పరిసరాల పరిశుభత్రతో కలిగే లాభాలు, మూఢ నమ్మకాలతో కలిగే అనర్థాల గురించి వివరించారు. శ్రమదానం, ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే.. తమకు తెలియని విషయాలను శిబిరంలో నేర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా శిబిరంలో పాల్గొన్న పలువురు ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్ల అభిప్రాయాలు వారి మాటల్లోనే..

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles