ద్విచక్రవాహనంపై వైరా ఎమ్మెల్యే పర్యటన

Fri,December 13, 2019 12:25 AM

-పైలాన్‌ ఏర్పాటుకు స్థల పరిశీలన
వైరా, నమస్తే తెలంగాణ: వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్‌ గురువారం తెల్లవారుజామునే పట్టణంలో ద్విచక్ర వాహనంపై పర్యటించారు. వైరాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం గతంలో రూ.20కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధులతో పనులు చేపట్టేందుకు మున్సిపల్‌ రాష్ట్ర అధికారులు పరిపాలన అనుమతులను మంజూరు చేశారు. ఈ నిధులతో వైరాలో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మించడంతో పాటు మౌలిక వసతులు కల్పించనున్నారు. గురువారం ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ ద్విచక్ర వాహనంపై వైరాలో పర్యటించి మున్సిపల్‌ నిధులతో అభివృద్ధి చేయనున్న రోడ్లను, పారిశుధ్య పనులను పరిశీలించారు. అదేవిధంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ఈ నెల14న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ శంకుస్థాపన చేయనున్నారు. పైలాన్‌ ఏర్పాటుకు ఎమ్మెల్యే స్థలాలను పరిశీలించారు. వైరాలోని ద్వారకానగర్‌లో పైలాన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు బొర్రా రాజశేఖర్‌, సూతకాని జైపాల్‌, మిట్టపల్లి నాగి, నాయకులు దార్న రాజశేఖర్‌, ఇజ్జగాని సత్యం పాల్గొన్నారు.

184
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles