14న మంత్రి అజయ్‌ నియోజకవర్గానికి రాక

Thu,December 12, 2019 12:56 AM

రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ 14న నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే సండ్ర తెలిపారు. ఉదయం 10 గంటలకు కల్లూరు మండలం కొర్లగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలిన పెనుబల్లి మండలం లంకాసాగర్‌, వేంసూరు మండలం బీరాపల్లిలో సబ్‌స్టేషన్‌ ప్రారంభోత్సవాలు, బీరాపల్లిలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభోత్సవం అనంతరం జేవీఆర్‌ డిగ్రీ కళాశాలలో జరిగే ఆడిటోరియం భవన పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా 17న పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి యర్రబల్లి దయాకర్‌రావు నియోజకవర్గంలోని పెనుబల్లి, సత్తుపల్లి మండలంలోని కొత్తూరు, గంగారం గ్రామాల్లో పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే వెంట తహసీల్దార్‌, ఇన్‌చార్జి కమిషనర్‌ మీనన్‌, నాయకులు చల్లగుళ్ల నర్సింహరావు, కృష్ణయ్య, కూసంపూడి మహేష్‌, గాదె సత్యం, కొత్తూరు ఉమామహేశ్వరరావు, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, చాంద్‌పాషా, అద్దంకి అనిల్‌, మల్లూరు అంకమరాజు, మారుతి బాబురావు పాల్గొన్నారు.

230
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles