కృత్తికా నికి అంకురార్పణ

Thu,December 12, 2019 12:56 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ, డిసెంబర్‌ 10: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో సంప్రదాయబద్ధంగా కృత్తికా దీపోత్సవానికి బుధవారం అంకురారోపణ జరిగింది. ఆలయ అర్చకులు పవిత్ర గోదావరి నది నుంచి తీర్థబిందెను తీసుకొచ్చారు. ఈ సందర్భంగా యాగశాలలో స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యఃవచనం, కంకణధార తదితర పూజలు నిర్వహించారు. గురువారం పౌర్ణమిని పురస్కరించుకొని దేవస్థానం ఆధ్వర్యంలో కృత్తికా దీపోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకోసం దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. అదేవిధంగా కృత్తికా దీపోత్సవం సందర్భంగా గురువారం నిత్యకల్యాణం నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు బుధవారం తెలిపారు. కృత్తికా దినోత్సవ కార్యక్రమంలో దేవస్థానం ఈవో జీ.నరసింహులు, ఏఈవో శ్రావణ్‌కుమార్‌, పర్యవేక్షకులు లింగాల సాయిబాబు, స్థానాచార్యులు స్థలసాయి, ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమరవాది విజయరాఘవన్‌, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

169
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles