పౌరసత్వ సవరణ బిల్లుకి టీఆర్‌ఎస్‌ వ్యతిరేకం

Tue,December 10, 2019 01:08 AM

-మైనార్టీ సోదరులకు టీఆర్‌ఎస్‌ అండగా ఉంటుంది
-టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్షనేత నామా నాగేశ్వరరావు
ఖమ్మం, నమస్తే తెలంగాణ:లోక్‌సభలో మంగళవారం కేంద్ర మంత్రి అమిత్‌షా ప్రవేశపెట్టిన పౌరసత్వ (సవరణ) బిల్లు-2019 పై టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్షనేత, ఖమ్మం పార్లమెంట్‌ సభ్యులు నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశం అతిపెద్ద విశా లమైన దేశమని, 135 కోట్ల జనాభా ఉన్న మనదేశంలో వివిధ కులాలు, మతాల వారు నివసిస్తున్నారని, ముస్లిం మైనార్టీ సోదరులకు కూడా పౌరసత్వం కల్పించే విధంగా ఈ బిల్లులో పొందుపర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని నామా కోరారు. మైనార్టీ ముస్లిం సోదరులను ఈ బిల్లులో పొందుపర్చకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లు-2019ని తాము వ్యతిరేకంగా ఓటు వేస్తామన్నారు. ఇది మా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ విధానమని, మేము ఎప్పుడు మైనార్టీ సోదరులకు అండగా ఉంటామని, అందుకే మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ముస్లింలకు కూడా పౌరసత్వం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

249
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles